హెల్మెట్ ధరించండి సురక్షితంగా గమ్యం చేరండి..

వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలి..

హెల్మెట్ (Helmet) ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి…

-జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్, ఏప్రిల్ 02, నంద్యాల: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న వాటిలో ఎక్కువగా ద్విచక్ర వాహనాల పై ప్రయాణిస్తున్న వారే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతు ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి హైవే లలో ప్రయాణించేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని లేనియెడల పోలీసులు భారీగా ఫైన్ విధించడంతోపాటు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారని ఆదేశాలు జారీచేశారు.హెల్మెట్ (Helmet) ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. కేవలం మోటార్ వాహన చట్టంలోని నిబంధనల కోసమో లేక పోలీసులు వేసే జరిమానా నుంచి తప్పించుకోవటం కోసమో హెల్మెట్‌ను ధరించడం కాకుండా మన భద్రత కోసం, మనపై ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల కోసం హెల్మెట్‌ను తప్పనిసరిగా ధరించండి .

ప్రమాదాలలో బండి నడుపుతున్న వ్యక్తితో పాటు కొన్నిసార్లు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్లే పాదచారులు కూడా మీరు చేసే తప్పిదం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.కావున జిల్లా ప్రజలు ద్విచక్ర వాహనాలలో ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి.ఇది మీ సంక్షేమం కొరకు తీసుకునే చర్యలో భాగంగా గుర్తించాలని తెలియజేశారు. హెల్మెట్ దరించకపోవడం వలన ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించారు.ట్రాఫిక్ నియంత్రణకు , రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లాలో పోలీసు అధికారులు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేస్తూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకొని దాన్ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ కొంతమంది ట్రాఫిక్ నిభందంలు పాటించకుండా ప్రమాదాలకు గురౌతున్నరు.హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని తెలిసినా, చాలా మంది అలసత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. హెల్మెట్లు లేకుండానే రోడ్లు మీద బైక్లు నడుపుతూ ఉంటారు.వారిపై పోలీసులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ద్విచక్ర వాహనంలో వెళ్లేటప్పుడు అతివేగంగా అజాగ్రత్తగా వెళ్లకుండా మీరు వెళ్లవలసిన సమయం కంటే 30 నిమిషాలు ముందుగానే బయలుదేరి అతివేగంగా వెళ్లకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని తెలియజేశారు. మీరు చేసే ఒక చిన్న తప్పిదం వల్ల ప్రమాదం సంభవించి మీరు మాత్రమే కాకుండా అవతలి వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడడం లేదా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!