Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉన్న సర్దార్ పాపన్నగౌడ్ విగ్రహానికి రామాయంపేట గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం నాడు పూలమాలలు వేసి ఘనంగా ఆయన వర్ధంతి వేడుకలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ మూడు వందల ఏళ్ల క్రితమే మొఘల్ సామ్రాజ్యాన్ని భూస్థాపితం చేసి బహుజన వర్గాల కోసం పోరాటం చేసిన ధీరుడు శ్రీ సర్దార్ సర్వాయి పాపాన్న గౌడ్ దోపిడిదారులను అంతమొందించి దొరల పాలనకు చరమగీతం పాడిన మహాత్ముడు ఆయన అని కొనియాడారు.ఏ ఒక్క కులానికో ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని కులాలను కలుపుకపోయి బహుజన రాజ్య స్థాపనకు కృషి చేసిన అధినేత సర్వాయి అని అన్నారు.కొన్ని వందల సంవత్సరాల క్రితమే గోల్కొండను ఏలిన బహుజన చక్రవర్తి ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్,సిద్ధ రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.