Reporter -Silver Rajesh Medak.
తేదీ1-4-2024.
మన ఊరు – మన బడి కార్యక్రమం లో గతంలో ప్రారంభం అయి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలి పంచాయతీ రాజ్ శాఖ అధికారులతో సమీక్ష జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్ రమేష్ ,* స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని విడియో కాన్ఫరెన్స్ హల్ లో సోమవారం పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు ఎన్నికల కోడ్ కంటే ముందే ప్రారంభ అయి ఇంకా పెండింగ్ లో ఉన్న మన ఊరు – మన బడి కార్యక్రమం లోని పనులు త్రాగు నీటి ఏర్పాట్లు,మరుగు దొడ్లు , విద్యుత్,వంట గది నిర్మాణాలు,ప్రహరీ గోడ లాంటి చిన్న చిన్న మరమత్తులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.