Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
తేది –01.04.2024.
ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేయడమైనది. ఈ కార్యక్రమంలో రేగోడు మండలం జగిర్యాల గ్రామానికి చెందిన రాములు, దుర్గయ్య తాము వెంకటరావుపేట శివారులో సర్వేనెంబర్ 112/ఇ01 గల భూమి రెండెకరాల 16 గుంటల నర బొడ్ల సత్యనారాయణ గ్రామం అల్లాదుర్గం గారి వద్ద నాలుగు లక్షల రూపాయలకు నగదు ఇచ్చి తేదీ:09.01.2014 నాడు కొనుగోలు చేయడం జరిగిందని రెండు నెలల్లో భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పి ఇప్పటివరకు మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం లేదు ఇన్ని సంవత్సరాలు నుండి మేము కబ్జాలో ఉన్న కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వము తిరిగి వెళ్ళిపోమని బెదిరిస్తున్నారు.
కావున పైన తెలిపిన వారిపై చట్టపరమైన చర్య తీసుకుని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని అల్లాదుర్గ్ సి.ఐ.కి సూచనలు చేయటం జరిగింది. అలాగే
మెదక్ పట్టణం ఫతేనగర్ కి చెందిన నట్ట అరుణ్ జ్యోతి తనకు తేదీ:22.04.2019 నాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లా పందిళ్ళపల్లి కి చెందిన అల్లగిరి శ్రీకాంత్ తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమై వివాహం జరిగినదని పెద్దల సమక్షంలో పెళ్లి తర్వాత మెదక్ మా ఇంటి వద్దనే ఉంటానని ఇల్లరికం గా మా ఇంటికి మా అత్తమామలు ఇష్టపూర్వకంగా పంపినారని ఇట్టి వివాహ సమయంలో నాకు కట్న కానుకల కింద బంగారం,వెండి ఇతర గృహోపకరణ వస్తువులు ఇవ్వడం జరిగింది. పెళ్లి ఖర్చుల కోసం, బైక్ కోసం 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చినారు మాకు ఇద్దరు సంతానం కలరు నన్ను అన్ని రకాలుగా మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడని నా భర్త అత్తమామలపై చర్యలు తీసుకొని నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేయగా చట్టప్రకారం ఫిర్యాదికి తగిన న్యాయం చేయమని మెదక్ పట్టణ సి.ఐ.కి సూచనలు చేయటం జరిగింది.