Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం, మెదక్ జిల్లా .
తేది -30.03.2024.
ఉద్యోగికి పదవి విరమణ అనివార్యం
శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలి
పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎలాంటి సమస్యలు
తలెత్తినా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ ముందుంటాము
జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్.
మెదక్ జిల్లాలో ఇద్దరు ఎస్.ఐ ల.గడ్డం రాములు ఎస్.బి ఎస్.ఐ మరియు బి.మల్లయ్య ఎస్.ఐ పదవి విరమణ సందర్భంగా ఈ రోజు మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని అన్నారు. జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. పదవి విరమణ చేసిన ఇద్దరు ఎస్.ఐ ల శ్రీ.గడ్డం రాములు ఎస్.బి ఎస్.ఐ మరియు శ్రీ.బి.మల్లయ్య ఎస్.ఐలకు వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. పదవి విరమణ పొందిన ఇద్దరు ఎస్.ఐ లు శ్రీ.గడ్డం రాములు ఎస్.బి ఎస్.ఐ మరియు బి.మల్లయ్య ఎస్.ఐ.లను సత్కరించి, జ్ఞాపికలు అందించి ఘనంగా సత్కరించారు.
పోలీసు శాఖలో శ్రీ.గడ్డం రాములు ఎస్.బి ఎస్.ఐ గారు 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని, హెడ్ కానిస్టేబుల్ గా,ఏ.ఎస్.ఐగా, ఎస్.ఐగా పదోన్నతి పొంది, పదవి విరమణ చేశారు. అలాగే శ్రీ.బి.మల్లయ్య ఎస్.ఐ 40 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుని, హెడ్ కానిస్టేబుల్ గా, ఏ.ఎస్.ఐగా, ఎస్.ఐగా పదోన్నతి పొంది, పదవి విరమణ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఎంతో పని ఒత్తిడితో విధులు నిర్వర్తించి, ఎలాంటి రిమార్క్ లేకుండా పదవి విరమణ చేయడం గొప్ప విషయం అన్నారు.
ప్రజా రక్షణ కోసం తమ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయక పోలీసులు పనిచేస్తారని అన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ తప్పక ఉంటుందని, ఇద్దరు ఎస్.ఐ లు శ్రీ.గడ్డం రాములు ఎస్.బి ఎస్.ఐ మరియు శ్రీ.బి.మల్లయ్య ఎస్.ఐ పోలీస్ శాఖకు చేసిన సేవలు ఎంతో అభినందనీయమని ఎస్పి పేర్కొన్నారు. పదవి విరమణ అనంతరం కూడా రిటైర్డ్ పోలీసు ఉద్యోగులకు ఏలాంటి అవసరం వచ్చినా, పోలీసు శాఖ సహాయ సహకారాలు ఉంటాయని, జిల్లా ఎస్.పి డా. శ్రీ.బి.బాలస్వామి ఐ.పి.ఎస్. భరోసా ఇచ్చారు.
అలాగే ఈ రోజు పదవి విరమణ పొందుతున్న ఎస్.ఐ లకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని డిపిఓ అధికారులను ఎస్పి గారు ఆదేశించారు. అలాగే పోలీస్ శాఖలో పని చేసి పదవి విరమణ పొందిన ఉద్యోగులు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని సూచించారు.
తమ ఆరోగ్యాల పట్ల తగు జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. పదవీ విరమణ పొందిన సిబ్బందికి ఎలాంటి సమస్యలు తలెత్తినా పోలీసు శాఖ తరపున ఎల్లప్పుడూ ముందుంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్.పి అడ్మిన్ శ్రీ .ఎస్. మహేందర్, ఏ.ఓ శ్రీమతి.లక్ష్మి లావణ్య లతా, ఎస్.బి సి.ఐ.సందీప్ రెడ్డి,ఆర్.ఐ. నాగేశ్వర్ రావ్, డి.సి.ఆర్.బి సి.ఐ..మధుసూదన్, జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.