విజయవంతంగా జరిగిన ఎపిస్టిమో వికాస్ లీడర్ షిప్ పాఠశాల ఆధ్వర్యంలో మెగా యూనివర్సిటీ ఫెర్…
హైదరాబాద్ మార్చి. : ఎపిస్టిమో వికాస్ లీడర్ షిప్ పాఠశాల ఆధ్వర్యంలో శనివారం జరిగిన మెగా యూనివర్సిటీ ఫెర్ విజయవంతంగా జరిగింది.అనునిత్యం విద్యారంగంలో జరుగుతున్న మార్పులు గమనిస్తూ తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసానికి దోహదపడే విధంగా సహాయ సహకారాలను సమాచారాన్ని అందించడం కొరకు ఎపిస్టిమో లీడర్షిప్ పాఠశాల ఆధ్వర్యంలో నల్లగండ్ల తేది 30న వేదిక ఏర్పాటు చేయడం జరిగింది.
వివిధ విశ్వవిద్యాలయాలు తమ అందుబాటులో ఉన్న అనేక రంగాలలోని అవకాశాల గురించి విచ్చేసిన అతిధులకు సంక్షిప్తంగా తెలియజేయడమే కాకుండా రానున్న సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాల గురించి కూడా సమాచారం అందించడం జరిగింది.ఎపిస్టిమో పాఠశాల ప్రధానాచార్యులు పద్మ కొల్లి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం అనగా 2024-2025 సంవత్సరంలో ఎపిస్టిమో పాఠశాలలో 11 వ తరగతి ప్రారంభిస్తున్నట్లు తెలియచేశారు. అంతేకాకుండా ఎపిస్టిమో విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు అందుకునే విధంగా విలువలతో కూడిన విద్యా విధానాన్ని అందిస్తున్నామని సగర్వంగా విన్నవించుకున్నారు.
పెపిస్టిమో ఉప ప్రధానాచార్యులు వాణి మాట్లాడుతూ యూనివర్శిటీ ఫెర్ యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, విద్యరంగంలో జరుగుతున్న మార్పుల అణు గుణంగా ఎపిస్టిమో విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండేల విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. ఎపిస్టిమో పాఠశాల కౌన్సిలింగ్ విభాగం అధిపతి రజత విద్యా రంగంలో జరుగుతున్న అనేక మార్పుల గురించి తల్లిదండ్రులు, విద్యార్థులతో చర్చించడమే కాకుండా అనేక విశ్వవిద్యాలయాలు ఆరంభించిన నూతనమైన కోర్సుల ద్వారా భవిష్యత్తు తరానికి నిర్వహించిన యూనివర్శిటీ ఫెర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించారు.
ఎపిస్టిమో పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి 80కి పైగా దేశాల నుంచి విశ్వవిద్యాలయాలు.భారతదేశం, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ, కెనడా, దుబాయ్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, సింగపూర్. వెస్ట్ ఇండీస్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా విద్యారంగంలో ప్రముఖ సంస్ధలు అయిన బిట్స్, అశోక, ఓ పి జిందాల్, ఎస్.ఆర్.ఎమ్, అజీం ప్రేమ్ జీ, ఇండియానా యూనివర్సిటీ ఆఫ్ లు మొదలైన విద్యా సంస్థలు పాల్గొన్నాయి. ఈ విద్యా సంస్థలకు చెందిన అధికారులు. అతిధులతో ముచ్చడించడమే కాకుండా వాళ్ళ విద్యాసంస్ధల ద్వారా నిర్వహించబడే కోర్సుల గురించి, స్కాలర్ షిప్ వేసవి కాలంలో నిర్వహించబడే కార్యక్రమాలు కాంపస్ జీవిత అనుభవాల గురించి ఆసక్తికర విషయాలను వివరించారు. తదుపరి సమాచార సేకరణ కొరకు ఎపిస్టిమో పాఠశాల కౌన్సిలింగ్ విభాగం అధిపతి రజతని సంప్రదించాలని కోరారు.