రాజకీయ ప్రకటనలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలి

Reporter -Silver Rajesh Medak.

పత్రికాప్రకటన తేదీ 30-3-2024, మెదక్


ఎంసీఎంసీ మీడియా సెంటర్ ప్రారంభోత్సవంలో –జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ రాజ్ ,జిల్లా అదనపు ఎన్నికల అధికారి అదనపు కలెక్టర్ రెవెన్యూ, వేంకటేశ్వర్లు.

స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని రూం నెం G1లో శనివారం జిల్లా అదనపు ఎన్నికల అధికారి / అదనపు కలెక్టర్( రెవిన్యూ) వెంకటేశ్వర్లతో, జిల్లా ఎన్నికల అధికారి /జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎంసీఎంసీ మీడియా సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. ఎం.సీ.ఎం.సీ సెల్ ద్వారా చెల్లింపు వార్తలను గుర్తించడం, ప్రచురణ, ముందస్తు అనుమతి లేకుండా ప్రకటన ప్రసారం చేయడం సంబంధిత ,అభ్యర్థి ప్రచార వ్యాయం లో లెక్కించడం ,సోషల్ మీడియాలో అభ్యర్థు లు రాజకీయపార్టీల ప్రకటన వంటి వాటిని సకాలంలో ఆమోది స్తూ మంజూరు చేయాలని సూచించారు .


శాటి లైట్ చానల్స్ లో వచ్చే వార్తలను పూర్తి స్థాయిలో రికార్డు చేయాలని అన్నారు . వార్తా పత్రికలు, ఈ పేపర్లు ,టెలివిజన్ ఛానళ్లు ,స్థానిక కేబుల్ నెట్వర్క్లు, సోషల్ మీడియా ,మూవీహౌస్ లు సంక్షిప్త సందేశాలు ఇతర ఆడియో వీడియో విజువల్ మీడియాలతో సహా ప్రకటనలు ఎంసిఎంసి నుండి ముందస్తు పొందిన తర్వాత మాత్రమే విడుదల చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఎన్నికలు నిస్వక్షపాతంగా సజావుగా నిర్వహించేందుకు మీడియా సహకారం అవసరమని ఈ సందర్భంగా తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.


సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రకటనలు ప్రసారం చేయవద్దని అట్టి వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు . పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటన పరిశీలించి పేడ్ న్యూస్ పరిశీలనకై మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎం సి ఎం సి మీడియా సెంటర్ ను ఉపయోగించుకోవాలని తెలియజేశారు.

ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై సి-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలి ….

సి-విజిల్ యాప్ ప్రతి పౌరుడు ఆయుధం …

ఓటర్ లను మభ్యపెట్టేందుకు ఎవరైనా అక్రమంగా నగదు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేయడం, ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడే వాటిని లైవ్ ఫోటోలు, లైవ్ వీడియోలను సి – విజిల్ యాప్ ద్వారా తీసి పంపాలని,

సి-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదు లపై వంద నిమిషాలలో సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారని, లైవ్ ఫోటోలు, వీడియోలను తీసేటప్పుడు, అప్లోడ్ చేసే సమయంలో జి.పి.ఎస్. ఆన్ లో ఉంచాలని, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆటోమేటిగ్గా లోకేషన్ నమోదు అవుతుందని, సభలు, సమావేశాల్లో విద్వేషపూరిత కామెంట్స్ చేసిన, పార్టీ అభ్యర్థులు పంచే డబ్బులు, మద్యం, బహుమతులు లాంటి వివరాలను, అనుమతి లేకుండా ర్యాలీలు నిర్వహించిన, ఇతర ఎన్నికల ఉల్లంఘనలపై లైవ్ ఫోటోలు, వీడియోలు సి – విజిల్ యాప్ ద్వారా పంపలన్నరు.

యువత సి-విజిల్ యాప్ ను ఉపయోగించి ఎన్నికల్లో జరిగే అక్రమాలను, ఉల్లంఘన లను తమ దృష్టికి తీసుకుని రావాలని, 24 గంటలు కలెక్టరేట్ కార్యాలయంలోని సమీకృత జిల్లా ఫిర్యాదుల పర్యవేక్షణ కేంద్రం నుండి సి-విజిల్ యాప్ ఫిర్యాదులపై పర్యవేక్షణ చేయడం జరుగుతున్నదని, ఫిర్యాదు చేసిన వారి పేర్లను, సెల్ నెంబర్ లను గోప్యంగా ఉంటాయి.

సి-విజిల్ యాప్ ను తమ ఫోన్ లలో ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని తమ చుట్టుపక్కల జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలను అప్లోడ్ చేయాలని, సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, వంద నిమిషాలలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

డయల్ 1950 టోల్ ఫ్రీ ..

వివిధ రాజకీయ పార్టీలు , లేదా అభ్యర్థులు చేసే ప్రలోభాలు నగదు ,మద్యం, చీరలు , వస్తువులలాంటి సంబందించిన పిర్యాదులను 1950 టోల్ ఫ్రీ కి ఫోన్ లో సమాచారం ఇవ్వలని, 24 గంటలు అందుబాటులో ఉంటదని ,ప్రజలు సంప్రదించాలని తెలిపారు.

ఎన్నికల అనుమతులు సువిధా తో ఎంతో సులువు

సాధారణ ఎన్నికలు 2024,ఎన్నికల నియమావళి లో బాగంగా వివిధ రాజకీయ పార్టీలు,అభ్యర్ధులు ,పబ్లిక్ మీటింగ్ లు ,ర్యాలీలు , వివిధ ప్రచార వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయా లు, మైక్ లు , లౌడ్ స్పీకర్లు, బ్యారికేడ్స్, హెలికాప్టర్ లాండింగ్, లాంటి అన్ని రకాల అనుమతుల కోసం సువిధా ఆన్ లైన్ పోర్టల్ లో ధరఖస్తు చేసుకోని , అనుమతి పొందాలని తెలిపారు.

సరైన వివరాలు దరఖస్తులో పొందపరిచిన వివిధ రాజకీయ పార్టీలా,అభ్యర్ధుల యొక్క ధరఖస్తు కు కేవలం 48 గంట లో నే అనుమతి పొందడం జరుగుతుందని తెలిపారు.సువిధ ఆన్ లైన్ పోర్టల్ ని జిల్లా ప్రజలు ,వివిధ రాజకీయ పార్టీలు, అభ్యర్ధులు, ఉపయోగించుకోవలన్నరు.ఈ కార్యక్రమం లో ఎలక్షన్ సూపర్డెంట్ హర్దీప్ సింగ్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, నోడల్ అధికారులు ఎలక్షన్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!