ఎన్నికల కోడ్ అమలులో ఉన్ననేపథ్యంలో సోషల్ మీడియా ట్రోలింగ్ లను తీవ్రంగా పరిగణిస్తాం

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ పై ప్రత్యేక నిఘా..

ప్రతి పోస్టుకు గ్రూప్ అడ్మిన్లదే పూర్తి బాధ్యత….

కుల,మత వర్గాల మధ్య విభేదాలు, విద్వేషాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన,సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేసిన చర్యలు తప్పవు…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడమే పోలీసుల లక్ష్యం…

-నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి

స్టూడియో 10 టీవీ న్యూస్ మార్చి 30, నంద్యాల:

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్ లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్లు, సోషల్ మీడియా ద్వారా తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై నంద్యాల జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం అని నంద్యాల జిల్లా ఎస్పీ కె.రఘువీర్ రెడ్డి హెచ్చరించారు.

-ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాట్సప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్ (X) గ్రూపుల్లో అడ్మిన్ల యొక్క బాధ్యతలు”.

👉 వాట్సప్, ఫేస్ బుక్ వంటి గ్రూప్ లో ప్రతి పోస్టుకి బాధ్యత తీసుకోవాలి
👉 గ్రూప్ లో యాడ్ చేసే ప్రతి సబ్యుడు తప్పకుండా అడ్మిన్ కి తెలిసి ఉండాలి.
👉 అభ్యంతకర, తప్పుడు వార్త, వదంతిపై స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలి.
👉 ఎవరైనా సభ్యులు అభ్యంతకరంగా ప్రవర్తిస్తే వెంటనే గ్రూప్నుంచి తొలగించాలి.
👉 ఆ వివాదస్పద పోస్టింగ్ సంబంధించి ఆడ్మిన్ ఏంచర్యలు తీసుకోకుంటే అతడిపై పోలీసులు చర్యలు తీసుకుంటారు.
👉 అడ్మిన్ వివాదస్పద పోస్టు చేస్తే ఐటీ చట్టం. ఐపీసీ సెక్షన్ 153(ఎ) కింద శిక్ష విధిస్తారు. 3 నుంచి 5 ఏళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశముంటుంది.

-పోస్ట్ మరియు షేర్ చేయకూడని అంశాలు…

👉 కుల,మత వర్గాల మధ్య విభేదాలకు, విద్వేషాలకు దారి తీసే పోస్టులు పెట్టడం.
👉 రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం.
👉 తప్పుడు, తెలియని సమాచారాన్ని వ్యాప్తి చేయడం.
👉 సోషల్ మీడియా ట్రోలింగులు.
👉 ఆన్ లైన్ వేధింపులకు పాల్పడడం.
👉 మార్ఫింగ్ చేసిన ఫోటోలు, వీడియోలు పెట్టడం.

పైన పేర్కొన్న పోస్టులు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో గ్రూప్ అడ్మిన్లు, సభ్యులు పోస్ట్ లేదా షేర్ చేసిన ఎడల సదరు గ్రూప్ అడ్మిన్లు, షేర్ లేదా పోస్ట్ చేసిన వారిని గుర్తించి వెంటనే పోలీసువారి 9154987034 వాట్సప్ నెంబర్ కు తెలియజేయనిచో, పోస్టు పెట్టిన వారితోపాటుగా గ్రూప్ అడ్మిన్లు ఈ క్రింది సెక్షన్ల ప్రకారం శిక్షార్హులు అవుతారు.

ఆన్ లైన్ వేధింపులు, సోషల్ మీడియా ట్రోలింగ్ లకు పాల్పడితే ఐటి యాక్ట్ కింద గరిష్టంగా 5 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించబడును. ఉద్దేశపూర్వకంగా ఒక మహిళను లక్ష్యంగా చేసుకొని వేధిస్తే నేరుగా గాని, సోషల్ మీడియా వేదికల ద్వారా గాని అదేపనిగా సంప్రదించడం, వెంట పడడం దూషించడం, అవమానించడం, వేధించడం వంటివి తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 5 సంవత్సరాలు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించబడును. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… రాబోవు ఎన్నికలను దృష్టిలో రాజకీయ నాయకులు,అదికారులు, సామాన్యులను లక్ష్యంగా చేసుకొని సోషల్ మీడియా వేధింపులపై, ట్రోలింగ్ లపై పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తుందని, అసభ్యకరమైన, రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్న వారిని ఐ.పీ అడ్రస్ ద్వారా గుర్తించి కేసు నమోదు చేస్తామని,చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లలో వస్తున్న అసభ్యకర, అభ్యంతర, విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు మరియు ట్రోలింగ్లకు సంబంధించి ఏదైనా సమాచారం మీకు తెలిస్తే వెంటనే 9154987034 వాట్సప్ నెంబర్ కు సమాచారం అందివ్వాలని, అట్టి వారి యొక్క వివరములు గోపంగా ఉంచబడతాయని నంద్యాల జిల్లా ఎస్పీ తెలియజేశారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!