-కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు
స్టూడియో 10 టీవీ న్యూస్, మార్చి 30, మహానంది:
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 రోజులు ఉపాధి పనులు కల్పించేలా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం మహనంది మండలం తమ్మడపల్లె గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకులు ఆర్ . రామచంద్ర రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. అనంతరం మహానంది ఫారెస్ట్ నర్సరీలో జరుగుచున్న మొక్కల పెంపకం పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పనులను, పని కోరిన ప్రతి వారికి పనులు కల్పించాలని, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100 రోజులు పనులు కల్పించేలా తగు చర్యలు తీసుకోవాలని, గ్రామాల్లో తాగునీటి సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని, ఆర్డబ్ల్యూఎస్ శాఖ వారికి ఆదేశించారు. మండలంలో ఎన్నికల కోడ్ సంభందించి విధులతో పాటు, ఉపాధి హామీ పనులు, త్రాగు నీరు, విద్యుత్ సౌకర్యాలను పర్యవేక్షించాలని మండల అభివృద్ధి అధికారి, ఈ ఓ ఆర్ డి వారిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏపీడీ నంద్యాల క్లస్టర్ బాలాజీ నాయక్, ఎంపిడివో శ్రీనివాసరెడ్డి , ఈ ఓ ఆర్ డి శివ నాగజ్యోతి, ఏపీవో మనోహర్, ఈసీ రామేశ్వర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ పవన్, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.