Venkatramulu, Ramayampet Reporter
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.అనంతరం సిఎస్ఐ చర్చి ప్రేసిబిటర్ ఇన్చార్జి గురువులు సత్యానందం దైవ ప్రసంగం చేస్తూ మానవాళి పాపముల కోసమే యేసుప్రభువు రక్షించుటకు ఈ భూమిపైన అవతరించి తాను సిలువలో చనిపోయి తిరిగి మూడవ దినమున మృత్యుంజయుడుగా లేస్తానని ముందుగానే తన శిష్యులకు లేఖనాల ప్రకారం చెప్పేనని తెలిపారు.ఈ రోజు సిలువలో తన ప్రాణాలు పెట్టి రక్తాన్ని చిందించినp రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నట్లు తెలిపారు.ప్రతి సంవత్సరం క్రైస్తవులు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు.యేసు ప్రభువు మానవాళి పట్ల ప్రేమ, నిస్సయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమా దయ ఆకాశమంతటి సహనం, మానవాళి శాంతియుత సమాజం కోసం సన్మార్గ జీవితాన్ని మానవజాతికి అందించి మానవాళికి దైవ సందేశం ఇచ్చిన కరుణామయుడు యేసుప్రభువు అని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో చర్చి గురువులు సత్యానందం, సంఘ నాయకులు సాగర్, డేవిడ్, సాల్మన్ రాజ్, సంపత్ కుమార్, కట్ట ప్రసాద్, రమేష్, దీనెష్, జేమ్స్ సంఘ విశ్వాసులు తదితరులు పాల్గొన్నారు.