గోవిందారావుపేట మండలం కోటగడ్డ గ్రామానికి చెందిన కమ్యునిస్ట్ నాయకుడు తుమ్మల భిక్షం రెడ్డి గారు మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు
ఈ సందర్భంగా మాట్లాడుతూ తుమ్మల భిక్షం రెడ్డి గారి అకాల మరణం కమ్యునిస్ట్ ఉద్యమానికి తీరని లోటని ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి వర్యులు సీతక్క గారు అన్నారు. ఇదే గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ గారి తండ్రి అనారోగ్యం తో భాద పడుతుండగా వారిని పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితులు కుటుంబ సభ్యుల ను అడిగి తెలుసుకున్నా మంత్రి వర్యులు సీతక్క. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్,మండల అధ్యక్షులు పాలడుగు వెంకట కృష్ణ తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.