Reporter -Silver Rajesh Medak. తేది 24/03/2024.
ఖాతాదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఏపిజివిబి బ్యాంక్ మేనేజర్లు
ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తుందని చెప్పినా పట్టించుకోని బ్యాంకు అధికారులు
బ్యాంకు అధికారుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతుల ఆవేదన
మెదక్
మెదక్ నియోజకవర్గంలో ఆంద్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపిజివిబి) మేనేజర్ రామచందర్ తోపాటు ఇతర ఏపీజీవీబీ బ్యాంకు మేనేజర్లు, అధికారులు బ్యాంక్ లో వ్యవసాయ రుణాల కింద తీసుకున్న ఖాతాదారులను తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లాలోనీ మండల కేంద్రమైన పాపన్నపేట,మెదక్ మండలం,హవేలీ ఘనపూర్, చిన్నశంకరంపేట, రామాయంపేట మండలాల తో పాటు బ్యాంక్ పరిధిలోని ఆయా గ్రామాల ఖాతా దారులకు అడ్వకేట్ నుండి నోటిసులు పంపించడం, ఖాతాదారులు ఇంట్లో లేని సమయంలో ఆదివారం సెలవు దినాల్లో సైతం అడవారిపై నానా దుర్భాశలాడుతూ ఖాతాదా రుల ఇండ్ల పొటోలను తీయటం, అప్పులు చెల్లించని యెడల మీ యొక్క ఫోటోలు బ్యాంక్ వద్ద ఫ్లెక్సీలు వేస్తామని బెదిరిస్తున్నారు.మండల కేంద్రానికి చెందిన ఓ ఖాతా దారుని ఇంటికి శనివారం, ఆదివారం బ్యాంకులకు సెలవు దినం అయినప్పటికి అవేమి లెక్కచేయకుండా తమ సిబ్బందితో ఇల్లు, ఇల్లు తిరుగుతూ తీసుకున్న అప్పులు ముక్కు పిండి వసూలు చేయాలని కంకణం కట్టుకున్నారని ఖాతాదారులు వాపోతున్నారు. ఓవైపు రాష్ట్రప్రభుత్వం రైతులపై ఎలాంటి వత్తిడి చేయవద్దని, బ్యాంక్ లో రైతులు తీసుకున్న రూ.2లక్షల వరకు ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పినప్పటికీ పేపర్ లో వచ్చినవన్ని నిజాలేనా? అని ఎదురు ప్రశ్నలు వేస్తూ దాడికి దిగుతున్నారు. అదీ గాక బ్యాంక్ లో రుణాలు తీసుకున్న రైతులు ఇంట్లో లేనప్పటికీ అడవారిపై తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తు న్నారు. ఇప్పటి కైనా రైతులపై బ్యాంక్ మేనేజర్ వేధింపులు ఆపాలని,లేని యెడల ఎవరైనా రైతులు మానసికంగా కుంగి పోయి తీసుకునే నిర్ణయాలకు మేనేజర్ బాధ్యత వహించాలని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకుని మేనేజర్ ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు వేడుకుంటున్నారు.