అంబర్పేట బతుకమ్మ కుంటలోని పోచమ్మ బస్తీలో శ్రీనిధి రెసిడెన్సీలో నివాసముండే మెజిస్ట్రేట్ మణికంఠ(36) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్స్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
ఘట్కేసర్ మండల్ ముచ్చువెల్లి గ్రామానికి చెందిన మణికంఠ నాంపల్లి కోర్టులో స్పెషల్(JFCM) ఫర్ ఎక్సైజ్ కేసెస్ సంబంధించి ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్నాడు…
మణికంఠ ఏడు సంవత్సరాల క్రితం మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రానికి చెందిన లలితతో వివాహం కాగా రెండు సంవత్సరాలు నుంచి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు…
వివాదాలతో కొంతకాలం నుండి పుట్టింట్లోనే ఉంటున్న లలితతో జరిగిన మనస్పర్ధలు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల వెల్లడి…
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న అంబర్పేట పోలీసులు