శ్రీకాకుళం గార మండలం దీపావళి గ్రామం శ్రీ ధర్మశాస్త్ర జ్ఞానాశ్రమంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం పర్వదినం శుభ సందర్భముగా శ్రీ అయ్యప్పస్వామి వారి వేడుకలు, అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 6:00గంటల నుండి సామూహికంగా అఖండ దీపారాధన విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము కలశ పూజ కుంకుమార్చన అభిషేకములు అర్చనలు మరియు భజన కార్యక్రమం 2000 మందికి అన్నసమారాధన ప్రముఖ గురుస్వామి బ్రహ్మశ్రీ రంగాభట్ల శ్రీను గురు స్వామి గారి ఆధ్వర్యంలో మహా వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా విశ్వహిందూపరిషత్ కార్యదర్శి శబరిమల అయ్యప్ప సేవా సమాజం శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ శ్రీరంగం మధుసూదన రావు గురుస్వామి మాట్లాడుతూ మనిషి జీవితం ఒక సాధన నిత్య సాధన నిరంతర సాధన జన్మ జన్మల సాధన సాధన ద్వారా సంస్కారం సంస్కారం ద్వారా సౌశీల్యం సౌశీల్యము ద్వారా సద్గతి ఇదే సోపాన పరంపర – ఇలాంటి నిత్య సాధన ధర్మ సాధనలో తొలిమెట్టుగా ఉపకరిస్తాయి శ్రీ అయ్యప్ప దీక్షలు ధర్మానురక్తిని దైవభక్తిని దేశభక్తిని వైయక్తిక శక్తిని అందిస్తాయి అయ్యప్ప దీక్షలు ప్రపంచ నాగరికతలలో హిందూ నాగరికత ఒకటే నేటికీ నిలిచి ఉంది దీనికి వేదములు వేద ధర్మములు మూలము దీనినే హిందూ ధర్మమని సనాతన ధర్మమని అంటాము.
చరిత్రకందని కాలం నుండి భారత పుణ్యభూమిలో విరాజిల్లిన హిందుత్వము ప్రపంచ నలు దిశలలో వ్యాపించింది కాలగమనంలో అనేకమంది మహితాత్ములు ఋషులు వారి బోధనల వల్ల బౌద్ధ జైన చిక్కు ద్వైత అద్వైత విశిష్టాద్వైత మొదలగు సాంప్రదాయాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. హిందుత్వములో ఇవి ఒకదానికొకటి పూరకములు విరోధములు కావు అవి అన్ని హిందూ ఆస్తిక జనుల జీవితాలను పునీతం చేస్తున్నవి ప్రతి హిందువు వ్యక్తిగత సాధనకు సామాజిక సంఘటనకు సూత్రాన్ని అందించు ప్రయత్నమే శ్రీ అయ్యప్ప జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం పర్వదినం జరుపుటకు కారణమని అని అన్నారు.
ఇట్టి దివ్యానుభూతి పొందాలి అంటే మానవుడు దైవ కార్యక్రమాలను పూజలను దీక్షలను చేయాలి కావున స్వామి అయ్యప్ప ఆపద్బాంధవుడు అనాధ రక్షకుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి అయ్యప్ప స్వామి వారి పూజలతో వ్రతాలతో దీక్షలతో జీవితం సార్థకం చేసుకుందాం విశ్వశాంతి చేకూర్చుదాం అన్నారు. లోక కల్యాణానికై మన హిందూ ధర్మ పరిరక్షణకై మన హిందూ ధర్మాన్ని విశ్వ గురుస్థానంలో ఉం చాలి అంటే ఇటువంటి దైవ కార్యక్రమాలు గ్రామ గ్రామాన జరగాలి అని ప్రతి ఒక్కరూ భగవంతుని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అన్నారు.
ఈ కార్యక్రమంలో గురుస్వాములు రుప్ప రమణమూర్తి,మెయిల అశిరినాయిడు కోర్ను రమణమూర్తి పంచిరెడ్డి రామకృష్ణ, బస్వా శ్రీనివాస్ రెడ్డి ట్రాఫిక్ జామ్ శ్రీను గురుస్వామి రౌతు సింహాచలం చల్ల లక్ష్మినారాయణ చల్ల లక్ష్మణ రావు బగ్గు మాధవరావు చల్ల జగన్నాదం శిమ్మ బాలమురళి చింతు శ్రీనివాస్ చల్ల ప్రసాద్ పలాస శ్రీనువాస్ పాల కామరాజు అల్లు కేశవరావు జోగా అప్పలరాజు చీకటి దానయ్య రుప్ప శంకర్ కుంచాల ఆనంద్ దీపావళి గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు.