ఎమ్మెల్యే అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు గెలుపుకు కృషి చేస్తా……

ఉండి నియోజక వర్గ బీసీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్ అరివెల్లి బలరాముడు…..ఉండి: ఉండి నియోజక వర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ,డిసిసిబి చైర్మన్ పివీఎల్ నరసింహరాజును ఆయన కార్యాలయంనందు ఉండి నియోజక వర్గ బీసీ సంఘం సోషల్ మీడియా కన్వీనర్, తమ్మినేని యువసేన ప్రతినిధి అరివెల్లి బలరాముడు దేవి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు.ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసింహరాజు ఖరారు అయిన శుభసందర్భంగా ఆయన్ని కలిసి పూలదండ శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగిందని బలరాముడు ఓ ప్రకటనలో తెలియచేశారు. ఈ సందర్భంగా నరసింహరాజు మాట్లాడుతూ…సోషల్ మీడియా సేవలు విస్తృతం చేయాల్సిన సమయం వచ్చిందని,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను గడప గడపకు వెళ్లి ప్రజలకు అదే విధంగా సోషల్ మీడియా వేదికగా తెలియచేయాలని పిలుపునిచ్చారని,ఆయన చెప్పినట్టు తూచా తప్పకుండా పివీఎల్ గెలుపుకు మా వంతు కృషి చేస్తామని,తద్వారా ఉండిలో ఆయన్ని గెలిపించి సిఎం జగన్ మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని బలరాముడు అన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!