ఆదివాసీ నాయకురాలు మంత్రి అవడాన్ని జీర్ణించుకోలేని కొందరు ప్రతిపక్ష నాయకులు సీతక్క పై దుష్ర్పచారం చేస్తున్నారు.

మంత్రి సీతక్క గారిపై కావాలని కుట్రపూరితంగా ఎక్కడ ఏం జరిగిన సీతక్క గారిని ఇరికిస్తూ సామాజిక మాధ్యమాల్లో అసత్య ఆరోపణలు చేస్తున్నారు…**తస్లీమా గారిపై కూడా కావాలని కొందరి నాయకుల కుట్రపూరిత చర్య…**ములుగు జిల్లాలో నిజమైన సేవకులు సీతక్క మరియు తస్లీమా గార్లు, అలాంటి తస్లీమా గారి సేవా దృక్పథం నచ్చింది కాబట్టే సీతక్క గారు దగ్గరకు తీశారు…**ఒకవేళ తస్లీమా గారు అవినీతి చేస్తే చట్టం తగు చర్యలు తీసుకుంటది, తను అవినీతి చేయకపోతే చట్టమే తనని వదిలేస్తారు..**ఏసీబీ అధికారుల విచారణలో నిజాలు తెలుస్తాయి…**కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్లు దోచుకున్న కెసిఆర్ దొరను ఏనాడూ ప్రశ్నించని కొందరు చెంచాలు ఇవ్వాళ సీతక్క గారిని కావాలని ప్రశ్నించడం బాధాకరం…**తెలంగాణ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి 1200 మంది యువకుల ప్రాణాలు తీసిన ఉన్మాది కెసిఆర్ గారిని ప్రశ్నించకపోవడం ఇంకా అవమానకరం..**కొత్త బిచ్చగాళ్లకు పొద్దు పోదు అన్నట్టు ఎంతసేపు వాళ్ళ దొర చేసిన అక్రమాలను ప్రశ్నించకపోగ, దొర కింద బానిసలా ఉండి, ఆదివాసీ బిడ్డ, పేదింటి బిడ్డపై వారి ప్రతాపాలు చూపిస్తారు…**అన్యాయం అయితే ప్రశ్నించండి, కానీ సీతక్క గారిని కావాలని కొందరు లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేయడం వారి బానిసత్వానికి పరాకాష్ట అని అంటున్న ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎండి. అహ్మద్ పాషా గారు…* గత కొద్ది రోజుల క్రితం మానుకోటలో జరిగిన ఏసీబీ దాడుల్లో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలోని పొరుగు సేవల నిమిత్తం పని చేస్తున్న వెంకటేష్ దగ్గర దొరికిన డబ్బును కావాలని తస్లీమా మహమ్మద్ గారి ఛాంబర్ యందు ఉంచి దోషిగా నిలబెట్టారు తప్ప తస్లీమా గారి దగ్గర ఎటువంటి డబ్బు దొరకలేదని స్పష్టంగా ఏసీబీ అధికారులు చెప్పిన వినని కొందరు ప్రతిపక్ష నాయకులు, అక్రమ దందాలు చేసే అవినీతి పరులు సామాజిక మాధ్యమాల్లో కావాలని తస్లీమా గారిపై తప్పుడు ప్రచారాలు చేస్తూ శునకనందం పొందుతున్నారని, కావాలని ఆ అవినీతిలో సీతక్క గారిని ఇరికిస్తూ ఫోటోలు మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్న దుండగులను వెంటనే శిక్షించాలని ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఎండి. అహ్మద్ పాషా గారు డిమాండ్ చేశారు. నిజంగా ఏమి జరిగిందో కూడా పూర్తిగా తెలుసుకోలేని చేతకాని వారు కావాలని తస్లీమా మరియు సీతక్క గారిపై నిందలు మోపడం సమంజసం కాదని అన్నారు. కరోనా కాలంలో కానీ ఏ సమయంలో అయినా పేదలకు కష్టం వస్తె అండగా నిలబడింది వారిరువురే అని అలాంటి వారిపై కొందరు ప్రతిపక్ష నాయకులు కావాలని కుట్ర పూరిత చర్యలు చేస్తూ, వారి కీర్తిని, వారి స్థాయిని కించపరచాలని అసత్య ప్రచారానికి దిగారని అన్నారు. వెంటనే ప్రభుత్వ పోలీస్ అధికారులు వెంటనే అలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ మానవత్వానికి ప్రతిరూపం అయిన మా సీతక్క గారిని లక్ష్యంగా చేసుకుని ఫోటోలు ఎడిట్ చేసి సంఘంలోకి తప్పుడు సమాచారాన్ని అందిస్తున్న నకిలీ వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేసి వారికి తగిన ప్రభుత్వ శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. సీతక్క గారు జాతీయ స్థాయి గుర్తింపు రావడం ఓర్చుకొలేని నాయకులు, ఆదివాసీ మహిళా అని కూడా చూడకుండా కావాలని అసత్య ఆరోపణలు చేస్తూ శునకానందం పొందుతున్నారు అని అన్నారు. నిజంగా మీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రండి మేము సిద్దం మీరు సిద్దం అయితే చర్చకు కుర్చుందాం రండి అని అన్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే పట్టుకుని రండి అని అన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!