Hyderabad:
లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది.
లోక్ సభ ఎన్నికల ముందు ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ కు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కాగా, తాజాగా బీఆర్ఎస్ నేత సంతోష్ రావుపై కేసు నమోదైంది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై పోలీస్ కేసు ఫైల్ అయ్యింది. అయితే రోడ్ నెంబర్ 14 లో ఉన్న ల్యాండ్ కబ్జాకు సంతోష్ రావు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ల సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో NECL కంపెనీ కు చెందిన భూమి ఉంది. అయితే అందులో అక్రమంగా చొరబడి నిర్మాణం చేపట్టారని సదరు భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సంతోష్ రావు తో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై బంజరాహిల్స్ పిఎస్ లో కేసు నమోదు అయ్యింది. కాగా సంతోష్ రావు పై 420,468,471,447,120,r/w 34 IPC కింద కేస్ నమోదు చేసినట్టు తెలుస్తోంది. అయితే కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.