ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో…ప్రపంచ జల దినోత్సవము పై అవగాహనగోడ పత్రిక ఆవిష్కరణ.

శేరిలింగంపల్లి మార్చి 21 తెహెల్క పవర్ ప్రతినిధి

ప్రపంచ జల దినోత్సవాన్ని పురస్క రించుకుని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియే షన్ కన్వీనర్ తాడిబోయిన రామ స్వామి యాదవ్ ఆధ్వర్యంలో నీటి యొక్క ప్రాముఖ్యత నీరు వృథా కాకుండా కలుషితం కాకుండా చూ డటంపై అవగాహన పెంపొందించే విషయాలను వివరించే గోడ పత్రిక ను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ 15వ డివిజన్ జనరల్ మేనేజర్ రాజశేఖర్ వారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ…. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 22వ తారీఖు నాడు ఐక్యరాజ్య స మితి వారి సూచనల మేరకు ‘ప్ర పంచ నీటి దినోత్సవాన్ని నిర్వహిం చుకొనుచున్నాము. దీని ప్రధాన ఉద్దేశ్యం నీటి ప్రాముఖ్యతను గురిం చి అవగాహన కల్పించడం,నీటి సం రక్షణ గురించి తెలియజేయటమే నన్నారు. ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఈ పండుగ నిర్వహించుకొ నుచున్నాము. ఈ సంవత్సరం శాంతి కోసం నీరు’_అనే నినాదంతో నిర్వ హించుకొనుచున్నాము. ఈ సృష్టిలో సకల జీవరాసులకు గాలి తరువాత నీరే ప్రధానమైనదన్నారు. ఈ భూగో ళము పైన సృష్టిలో ఉన్న నీటి వన రులలో 99 శాతం ఉప్పునీరే.ఇందు లో 97 శాతం సముద్రాలలో ఉండ గా మిగతా నీరు నదులు,చెరువుల లో ఉన్నది.త్రాగేందుకు ఉపయోగ పడే జలము కేవలం 1శాతం మాత్ర మే.అందులో 0.86 శాతం చెరువు లు,0.02 శాతం నదులలో,మిగతా 0.12 శాతం భూగర్భ జలాలుగా ఉన్నది.ప్రపంచ వ్యాప్తంగా కేవలం 0.3 శాతం నీరు మాత్రమే ఉపయోగ పడే విధంగా ఉన్నది.ఈ కొద్ది పాటి వనరులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 700 కోట్ల పైచిలుకు గల జనాభా యొక్క దాహన్ని, ఇతర అవసరా
లు తీరుస్తున్నాయి. ప్రపంచ నాగరిక తలు నదీ తీరాలు,నీటి వనరుల స మీప ప్రాంతాలలోనే విలసిల్లాయి,జీ వము నీటితోనే మొదలయింది.అం తేకాకుండా ప్రపంచానికి ఆహారోత్ప త్తులను ఉత్పత్తి చేయడానికి కూడా నీరు చాలా అవసరం.ప్రకృతిఅంతా నీటితోనే నడుస్తుంది.అభివృద్ధి జర గాలంటే నీటి వనరులు కావాలి.జీవ వైవిధ్య రక్షణ,జీవం నీటితోనే సాధ్య మవుతుంది.ఇన్ని తెలిసినా నీటిని వృథా చేస్తూ,కలుషితం చేసి విషతు ల్యంగా మార్చే స్తున్నాము. ప్రపంచం లో కోట్లాదిమంది త్రాగడానికి నీరు లేక దాహంతో అల్లాడి పోతుంటే నీటిని వృథాగా నేలపాలు చేస్తు న్నాం. నీటి వనరులను వ్యర్థాలతో కలుషితం చేసి త్రాగడానికి వీలు లేని విధంగా తయారు చేస్తున్నాం. ప్రపం చంలో పరిశుభ్రమైన నీరు అందక, అనారోగ్యం పాలై వేలాదిమంది చని పోతున్నారు. ముఖ్యంగా భారత దేశంలో ప్రతి మానవునికి గ్రామాలు చిన్న పట్టణాలలో రోజుకు 130 లీట ర్లు, నగరాలలో 150 లీటర్లు త్రాగడా నికి,స్నానానికి, వంటకు ఇత్యాది గృహ అవసరాలకు కనీసంగా కావ లసివస్తుందన్నారు. భవిష్యత్తులో నీటికొరకు యుద్ధాలు (దేశాల మ ధ్య,రాష్ట్రాల మధ్య, జిల్లాల మధ్య) జరిగే ప్రమాద ముందని ఐక్యరాజ్య సమితి తన నివేదికల ద్వారా హెచ్చ రిస్తున్నది. భూగర్భ జలమట్టాలు పెంచడానికి ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రకృతి ప్రసాదించిన వనరులను భవిష్యత్తు తరాలకు అందించడానికి పొదుపుగా వాడుకో వలసిన సామాజిక బాధ్యత అందరి మీదా ఉందని తెలిపారు. ఈ సంద ర్భంగా అందరిచేత,ఇంకుడు గుంత లు ఏర్పాటు చేసుకుంటాం. నీటిని వృథా చేయం. నీటి వనరులను కలుషితం కానీయం అని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జలమండలి అధికారులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ డైరెక్టర్ మా రబోయిన సదానంద్ యాదవ్,స భ్యులు పాలం శ్రీను,వెంకటేశ్వర్లు, రఘునాథరావు,జీవి.రావు,జిల్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!