మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో విశ్వకర్మ మనుమయ సంఘ కార్యవర్గం సభ్యులు బ్రహ్మంగారి గుడి కోసం స్థలాన్ని కేటాయించాలని అలాగే సంఘ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించి నిధులు మంజూరు చేయాలని గత 20 సంవత్సరాలుగా సంఘ భవనం లేక నానా ఇబ్బందులు పడుతున్నామని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుకు బుధవారం వినతి పత్రాన్ని అందజేశారు.ఈ విషయంలో ఎమ్మెల్యే రోహిత్ రావు తప్పకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రామాయంపేట మండల విశ్వకర్మ మనుమయ సంఘం అధ్యక్షులు కొడపర్తి లక్ష్మణాచారి,పట్టణ అధ్యక్షులు కమ్మరి యాదగిరి చారి,ఉపాధ్యక్షులు కొడపర్తి పాండు చారి, ప్రధాన కార్యదర్శి కొడపర్తి నరేందర్ చారి,కమ్మరి వెంకట్ రాములు,సుంకోజు దామోదర్ చారి, సహాయ కార్యదర్శి కమ్మరి వెంకట్ రాములు సంఘ సభ్యులు కమ్మరి చంద్రమౌళి చారి కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రభాత్రావు,అల్లాడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.