నర్వ:-పదో తరగతి పరీక్షలు జరిగే 3 పరీక్ష కేంద్రాల వద్ద రేపటి నుంచి 144 సెక్షన్ అమలులో ఉంటుందని నర్వ మండల తహసీల్దార్ పి మల్లారెడ్డి,ఎస్సై కురుమయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు.మండలం లో పరీక్ష కేంద్రాలు పెద్ద కడ్మూర్,నర్వ హై స్కూల్ ,కేజీవీబీ పాఠశాలలు ఈ పరీక్ష కేంద్రం ఆవరణంలో 144సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్సై అన్నారు. ఈ సందర్భంగా ఎస్సై కురుమయ్య మాట్లాడుతూ.. 10 వ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, పరీక్ష కేంద్రం ఆవరణంలో 144సెక్షన్ అమలు చేస్తున్నందున 100మీటర్ల లోపు ఇతరులు ఎవరూ ఉండరాదని హెచ్చరించారు. నలుగురు కంటే ఎక్కువ మంది గుమికూడదని అన్నారు.పరీక్ష సమయంలో ఎవరైనా అనవసర చర్యలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకొంటామని పరీక్ష కేంద్రాల సమీపంలోని బుక్‌స్టాల్స్, జిరాక్స్ సెంటర్లు ఓపెన్ చేయొద్దని సూచించారు.