అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు

Reporter -Silver Rajesh Medak.
మెద

మార్చి-15, 2024

**అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఏర్పాటు *
మహిళా సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల నిర్వహణ.
మన ఊరు మనబడి ఇంకా పూర్తికాని పనులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి
చేయాలి .
జిల్లా సమైక్య మరియు ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష.*

శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ హాలులో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రమేష్, డి ఆర్ డి ఓ పి డి శ్రీనివాసరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, మెప్మా పీడీ ఇందిర సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు మహిళా సమైక్య సభ్యులతో అమ్మ ఆదర్శ పాఠశాలలగా పాటు పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పన
పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచి నాణ్యమైన గుణాత్మక విద్యను అందించాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతుందని ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఎన్నికల కోడ్ దగ్గర పడుతున్న తరుణంలో పాఠశాల మౌలిక వసతులు కల్పన ఈ ప్రక్రియను అంతా ప్రారంభించినట్లయితే ఈ విద్యా సంవత్సరం జూన్ 12 వరకు పాఠశాలలు ప్రారంభమవుతాయని అప్పటి వరకు పూర్తి చేయవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాఠశాలల్లో డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్ల మరమ్మత్తులు బాలికల పాఠశాలల్లో నూతన మరుగుదొడ్ల నిర్మాణం, మైనర్ ఎలక్ట్రిఫికేషన్ ఫ్యాన్లు ట్యూబ్ లైట్స్ స్విచ్ బోర్డ్స్ ఏర్పాటు చేయుట, టైల్స్, ఫ్లోరింగ్, రూప్ లీకేజెస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా కిచెన్ షేడ్స్ టాయిలెట్స్ నిర్మాణం జిల్లా సమైక్య ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తామని ఇవి ఈ పనులన్నిటికీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ టెక్నికల్ సిబ్బంది మహిళా సమైక్య సభ్యులకు గైడెన్స్ ఇస్తారని అమ్మ ఆదర్శ పాఠశాలల కిచెన్ సెట్స్ టాయిలెట్స్ జూన్ వరకు పూర్తి చేయాలని వర్క్ ప్రారంభించినప్పుడు వర్క్ ముగిసిన తర్వాత ఫోటోలు తీసుకుని ఎంబి రికార్డ్ చేసి ఏ ఈ ,డి ఈ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో జిల్లా సమైక్య ఆధ్వర్యంలో కలెక్టర్కు అందించాలని చెప్పారు.


అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల వద్ద 25 వేల రూపాయల వరకు ఎమర్జెన్సీ నిధులు వినియోగించవచ్చని, మిగిలిన పనులు జిల్లా సమాఖ్య కు కేటాయించాల్సి ఉంటుందని, డి ఎం ఎఫ్ టి, ప్రత్యేక అభివృద్ధి నిధులు, నరేగా నిధులను వినియోగించుకొని పాఠశాలలో మౌలిక వసతులు చేపట్టాలని అన్నారు.అమ్మ పాఠశాల నిర్వహణ కమిటీకి ప్రత్యేక బ్యాంక్ ఖాతా ప్రారంభించాలని అన్నారు.


పాఠశాలలో చేపట్టిన పనులకు లక్ష రూపాయల వరకు ఎంపీడీవో పరిశీలించి బిల్లులు చెల్లిస్తారని, లక్షకు పైగా పనులకు ఎం బుక్ లను పరిశీలించే జిల్లా కలెక్టర్ చెలింపులు చేస్తారని, అవసరమైన నిధులు కలెక్టర్ వద్ద అందుబాటులో ఉంచుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!