Reporter -Silver Rajesh Medak.
తేదీ: 15-3-2024, మెదక్ .
పార్లమెంటు ఎన్నికల కోసం కౌంటింగ్ సెంటర్,స్ట్రాంగ్ రూం ల పరిశీలన, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ .
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మెదక్ జిల్లాలో ఉన్న నర్సాపూర్ నియోజకవర్గం లో BVRIT ఇంజినీరింగ్ కళాశాల లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్,స్ట్రాంగ్ రూంలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం సూచనలతో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ కోసం BVRIT ఇంజనీరింగ్ కళాశాల లో కౌంటింగ్ సెంటర్, స్ట్రాంగ్ రూం లను పరిశీలించడం జరిగిందన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం నర్సాపూర్ నియోజకవర్గం లో ఉన్న BVRIT కళాశాలలో 5 సెగ్మెంట్ లకు కౌంటింగ్ సెంటర్, ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ సెంటర్ ను ,ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల లో 2 సెగ్మెంట్ లకు కౌంటింగ్ సెంటర్ లను ఏర్పాటు దిశగా ఏర్పాట్లు చేస్తున్నామని , కౌంటింగ్ సెంటర్,స్ట్రాంగ్ రూంలలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ ఆర్డీఓ శ్రీనివాసులు,తహశీల్దార్ కమలద్రి,BVRIT కళాశాల ప్రిన్సిపాల్ బాపిరాజు,ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ బిక్షపతి,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.