Reporter -Silver Rajesh Medak.
పత్రికా ప్రకటన, తేదీ: 15-3-2024, మెదక్ .
జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గిరిజన సంక్షేమ పాఠశాలలకు గడువు తేదీలోగా మౌలిక వసతులు కల్పించాలి ఇందుకు గాను మండల అభివృద్ధి అధికారుల పాత్ర కీలకం కలెక్టర్ రాహుల్ రాజ్.
జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని ఎంపీడీవోలతో అమ్మ ఆదర్శ పాఠశాలల మౌలిక వసతులపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా టాయిలెట్స్, వంట గదుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉన్నందున
ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలని, మే నెల వరకు పూర్తిస్థాయిలో ఉపయోగంలో తీసుకురావాలని చెప్పారు .
ఇంకనూ మన ఊరు మన బడి కార్యక్రమంలో 66% వర్క్స్ మిగిలి ఉన్నాయని వీటిని పరిగిలోనికి తీసుకొని పాఠశాలలో మౌలిక వసతులు త్రాగునీరు, ఎలక్ట్రిసిటీ, చిన్నచిన్న మరమ్మతులు, చేయాలని మరమత్తులకు గురి అయిన మరుగుదొడ్లను పునరుద్ధరించి తీసుకురావడం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా ప్రతి గ్రామంలో కమిటీ ఏర్పాటు చేసి ఎంపీడీవో ఏపీఎం సీసీ ల సమన్వయం ద్వారా ఈ కమిటీ ఏర్పాటు జరగాలని పాఠశాల కమిటీలు నిబంధనలను అర్థం చేసుకోవాలని కమిటీలకు కొన్ని స్కూల్స్ అప్పజెప్పాలని ఏ కమిటీ కు ఏ స్కూల్ అప్పజెప్పారు ఆ వివరాలను సమర్పించాలన్నారు.
పాఠశాలలో డ్రింకింగ్ వాటర్ కొరకు , అదేవిధంగా టాయిలెట్స్ రిపేరు, ఎలక్ట్రిఫికేషన్ , అలాగే మైనర్ వర్క్స్ తదుపరి బాలికల పాఠశాలలో నూతన టాయిలెట్స్ నిర్మాణం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు డిస్ట్రిక్ట్ మినరల్ ట్రస్ట్ ఫండ్ (DMFT), SDF పథకాల కింద నిధుల మంజూరు చేయబడ్డాయని చెప్పారు
ప్రణాళిక బద్ధమైన సలహాలు సూచనలు అందించడానికి ఇంజనీరింగ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని వివరించారు.
మండల అభివృద్ధి అధికారులు అమ్మ ఆదర్శ పాఠశాల విషయంలో చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.