Reporter -Silver Rajesh Medak. తేదీ 15-3-2024 మెదక్
గిరిజన గురుకులంలో వేసవి ప్రత్యేక శిక్షణ ఆరంభం హాజరైన 11 కళాశాల ఇంటర్ మొదటి సంవత్సర విద్యార్థినులు.
ఈ నెల 29 కొనసాగనున్న క్యాంప్ విద్యార్థులు సమగ్ర అభివృద్ధికి దోహదం ఆర్సీవో సంపత్ కుమార్
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వార్షిక పరీక్షలు పూర్తికావడంతో వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు తెలంగాణ గిరిజన గురుకులం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థినులకు ‘సమ్మర్ స్ప్రీ ‘ పేరిట ప్రత్యేక శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
అందులో భాగంగా మెదక్ లోని అజంపుర గిరిజన గురుకుల బాలికల కళాశాలలో శుక్రవారం నుంచి ఈనెల 29 వరకు కొనసాగనున్న కార్యక్రమాన్ని ఆర్టీసీ సంపత్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థినులకు వివిధ అంశాలపై నిపుణులు తర్ఫీదునిస్తారన్నారు. ఈ 15 రోజుల్లో విద్యార్థినులకు కమ్యూనికేషన్, లైఫ్, పబ్లిక్ స్పీకింగ్, మీడియా స్కిల్స్ వంటి అంశాలపై శిక్షణ పొందనున్నారు.
ఇందుకోసం ఎంపిక చేసిన 11 కళాశాల విద్యార్థినులు హాజరయ్యారని, వారికి అన్ని అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు వివిధ యూనివర్సిటీల నుంచి వచ్చిన శిక్షకులు ప్రణాళిక ప్రకారం బోధించనున్నారు.
ప్రతిరోజు ప్రత్యేకమైన కార్యక్రమాలతో పాటు స్పెషల్ మెనూ అందిస్తామన్నారు. ప్రత్యేక కార్యక్రమం విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతీ విద్యార్థిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కోఆర్డినేటర్ ప్రిన్సిపాల్ హిమబిందు, శిక్షకులు అపర్ణ, దీప్తి, లక్ష్మి, అర్షియా, అధ్యాపకులు పాల్గొన్నారు.