Reporter -Silver Rajesh Medak. తేదీ 15-3-2024 మెదక్ జిల్లా
ఎన్నికల సంఘం నియమాలు తప్పక పాటించాలి.. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
స్థానిక కలెక్టర్ కార్యాలయం లోని కలెక్టర్ ఛాంబర్ లో శుక్రవారం అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ,సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లతో కలిసి ARO లు,నోడల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పార్ల మెంట్ ఎన్నికలు షెడ్యూల్ రనుండడం తో నోడల్ అధికారులు కచ్చితంగా ఎన్నికల సంఘం నియమాలు తప్పక పాటించాలన్నారు. ఎన్నికల నియమాలు అమలులోకి వచ్చిన 24 గంటలు,48 గంటలు,72 గంటల్లో అధికారులు చేయవలసిన విధులను వివరించారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు,ప్రభుత్వ కార్యాలయాల్లో రాజకీయ పార్టీల నాయకుల పోటో లు,రాజకీయ పార్టీలు గుర్తింపు చిహ్నాలు,ఉండకుండా చూడాలన్నారు. ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి రాజకీయ పార్టీల,నాయకుల ఫ్లెక్సీలు, బోర్డ్ లు,బ్యానర్లు, గోడ రాతలు,రాజకీయ పార్టీల జెండాలు,లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వివరాలు, హోం ఓటింగ్ , సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు,పోలింగ్ రోజు,కౌంటింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తల పై దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పద్మశ్రీ, ఏఆర్వోలు, ఆర్డీవోలు ,తహసిల్దార్లు ,ఎలక్షన్ సూపర్డెంట్ హర్దీప్ సింగ్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.