Reporter -Silver Rajesh Medak. మెదక్, 15 మార్చి 2024
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి అర్హత కలిగిన వారికి రుణం కల్పించేలా కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులతో పీఎం విశ్వకర్మ యోజన పథకం పై వివిధ వృత్తుల్లో నైపుణ్యం పొందిన వారికి రుణాలు మంజూరు పై అవగాహన సదస్సు జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు రమేష్ మాట్లాడుతూ స్వీకరించిన దరకాస్తులను క్షేత్రస్థాయిలో పారదర్శకంగా పరిశీలించి అర్హులకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి నైపుణ్య ధ్రువీకరణ తర్వాత 5-7 రోజులపాటు ప్రాథమిక శిక్షణ ఉంటుందని, అదేవిధంగా 15 రోజుల పాటు అధునాతన శిక్షణ శిక్షణ తర్వాత రూ.15 వేల విలువైన పనిముట్లను ప్రోత్సాహకంగా అందిస్తారని పేర్కొన్నారు. బ్యాంకు ద్వారా మొదటి విడతగా లక్ష రూపాయలు, రెండో విడతగా రెండు లక్షల రూపాయలు ఋణం అందించబడుతుందని తెలిపారు. పీఎం ఈజీఎం, పీఎం ముద్ర పి యం స్వామి ది ఈ మూడు పథకాలు ద్వారా గతంలో లోన్లు పొందిన వారికి పీఎం విశ్వకర్మ పథకం వీరికి వర్తించదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల అధికారి , కృష్ణమూర్తి ,MSME ఏడి దశరథ్, డిపిఓ యాదయ్య మెప్మా పీడీ ఇందిర ఎల్డీఎం నరసింహమూర్తి, వివిధ కులవృత్తుల వారు, తదితరులు పాల్గొన్నారు