మెదక్ జిల్లా రామాయంపేటలో సత్యనారాయణ అనే రైతు తన 13 ఎకరాలలో ఖర్జూర మొక్కలు నాటి సాగు చేస్తున్నారు. ఖర్జూర మొక్కలే కాకుండా 50 రకాల పళ్ళ మొక్కలు సైతం అతని తోటలో పెంచుతున్నారు. ముఖ్యంగా ఖర్జూర సాగు లో డ్రిప్ సిస్టం ద్వారా మల్చింగ్ సిస్టం ఏర్పాటు చేసి తక్కువ నీటితో ఈ పంట సాగు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగేళ్ల క్రితం నాటిన కొన్ని మొక్కలకు ఖర్జూర గెలలు వేశాయి. ఈ ఖర్జూర మొక్కలు ఒకసారి నాటితే 80 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది.ఈ ఖర్జూర సాగు చేస్తున్న రైతు సత్యనారాయణ మాట్లాడుతూ మొక్కలు 8 మీటర్ల దూరంతో ఎకరాకు 68 మొక్కలు నాటి మొత్తం 13 ఎకరాలలో ఈ ఖర్జూరాలను సాగు చేసి సేంద్రీయ పద్ధతిలో కాపాడుతున్నట్లు తెలిపారు.2019లో రామాయంపేటలో 13 ఎకరాల్లో ఇట్టి ఖర్జూర సాగును ఎలైట్, బర్గి రకాల ఖర్జూర సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ ఖర్జూర సాగులో రైతు సత్యనారాయణకు జిల్లా ఉద్యానవన హార్టికల్చర్,అధికారి నరసయ్య మరియు మెదక్ నియోజకవర్గ హార్టీ కల్చర్ అధికారి సంతోష్ సలహాలు సూచనలు ఇచ్చారు.