మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో ట్రాక్టర్ పైన నక్కని నవీన్ (27) అను వ్యక్తి ధాన్యం తీసుకు వెళుతుండగా ట్రాక్టర్ నడిపిన బొడ్డు వంశీ అను వ్యక్తి దాన్ని అజాగ్రత్తగా నడుపగా, ట్రాక్టర్ అదుపు తప్పగా, ట్రాక్టర్ పై నుండి నవీన్ కింద పడి ట్రాక్టర్ టైర్ నవీన్ పై నుంచి వెళ్ళగా, వెంటనే స్పందించిన స్థానికులు నవీన్ ను రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువస్తుండగా మరణించాడని, బంధువుల సమాచారం మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రామాయంపేట ఎస్సై రంజిత్ కుమార్ తెలిపారు.