Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం, మెదక్ జిల్లా.
02.12.2023
మెదక్ జిల్లా ప్రజలకు ఎన్నికల సిబ్బంది మరియు పార్టీ అభ్యర్ధులు, ప్రధాన ఏజంట్లకు మరియు కౌంటింగ్ ఏజంట్లకు తెలియజేయునది ఏమనగా తేది 3-12-2023 (ఆదివారం) నాడు తెలంగాణ రాష్ట్ర శాసనసభ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు హవేలి ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వై.పి.ఆర్ కాలేజీ యందు ఉన్నందున ప్రజలు సహకరించగలరు.
కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో తేది: 3-12-2023 (ఆదివారం) ఉదయం 6 గంటల నుండి తేది: 4-12-2023 (సోమవారం) ఉదయం 6 గంటల వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. కావున ఈ సమయంలో 5 మంది కంటే ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడడం నిషేదం గలదు.
కౌంటింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలలో 1 ( ఒక ) కిలోమిటర్ రేడియస్ వరకు ప్రజలు గుమ్మి గూడవద్దు.
మధ్యం అమ్మకాలు డిసెంబర్ 3 ఉదయం 6 గంటల నుండి డిసెంబర్ 4 ఉదయం 6గంటల వరకు “నిషేదము ” గలదు.
ఎవ్వరూ కూడా టపాసులు కాల్చరాదు. టపాసులు కాల్చడం నిషేధించబడింది.
కౌంటింగ్ ప్రాంతం వద్ద ” పోలీస్ పికెట్” ఏర్పాటు చేయడం జరిగింది.
రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు భద్రతా సిబ్బందికి (సెక్యూరిటి వారికి) చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రనికి ప్రవేశం గలదు.
మోబైల్ ఫోన్లు, అగ్గిపెట్టెలు, లైటర్ల వంటి నిషేధిత వస్తువులను కౌంటింగ్ హల్లోకి తీసుకెళ్లడానికి అవకాశం లేదు.
గెలుపొందిన అభ్యర్థులు డిసెంబర్ 3న విజయోత్సవ ర్యాలీలు నిషేదం. మరుసటి రోజు 4న ర్యాలీ నిర్వాహణకు సంబందిత పోలీస్ అధికారుల నుంచి రాత పూర్వకంగా అనుమతి పొందాల్సి ఉంటుంది.
ప్రతీ ఒక్కరు పోలీసులకు మరియు రెవెన్యూ సిబ్బందికి సహకరించగలరు.
ఎవరైన ఈ నియమ నిబంధనలు పాటించని యెడల వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చట్ట రిత్య చర్యలు తీసుకోనబడును.
మెదక్ జిల్లాలో తేది: 3-12-2023 రోజున జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉన్నందున ఈ కార్యక్రమానికి హజరయ్యే అధికార / అభ్యర్థులు / ప్రధాన ఏజంట్లు / కౌంటింగ్ ఏజంట్లు / మీడియా ప్రతినిధులు పోలీసు వారు తెలియజేసిన ఈ దిగువ సూచనల ప్రకారం పాటించాలని జిల్లా పోలీస్ తరపున విజ్ఞప్తి చేయుచున్నాము.
ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి హజరయ్యే అధికారులు / అభ్యర్థులు / ప్రధాన ఏజంట్లు / కౌంటింగ్ ఏజంట్లు YPR కళాశాల ప్రధాన ద్వారం గుండా కౌంటింగ్ కేంద్రానికి వెళ్లాలి.
హవేలి ఘన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధి వైపిఆర్ కాలేజ్ లోనికి
గమనిక: జిల్లా కలెక్టర్ / ఎన్నికల అభ్వర్వర్లు / అదనపు కలెక్టర్ / జిల్లా ఎస్.పి / అదనపు ఎస్.పి / రిటర్నింగ్ అధికారులు / డి.ఎస్.పి.లు / సర్వీసు ప్రొవైడర్స్ – అంబులెన్స్, ఫైరింజన్ వాహనాలు మాత్రమే లోనికి అనుమతించబడును. వేరే ఇతర వాహనాలు అమనుమతి లేదు. వారి వారికి కేటాయించబడిన స్థలంలో మాత్రమే పార్కింగ్లు చేసుకోవాలి.
వాహనాదారులకు ముఖ్య గమనిక:- తేది: 3-12-2023 నాడు YPR కళాశాల హవేలిఘనపూర్ యందు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ గలదు. కావున ఉదయం 6 గంటల నుండి ఎన్నికల కౌంటింగ్ ముగిసేవరకు జనరల్ ట్రాఫిక్ మరియు సామాన్య ప్రజలకు ఈ రోడ్డు మార్గం నుండి అనుమతించబడదు. ఈ సందర్భం గా YPR కాలేజి వెళ్ళే మార్గాల నుండి ప్రవేశం లేదు. అనగా హవేలిఘనపూర్ చౌరస్తా నుండి తీన్ నంబర్ చౌరస్తా రోడ్డు మూసివేయబడును.
కౌంటింగ్ సంబధించిన విధులు నిర్వహణ కోసం వచ్చే వాహనాదారులు తమకు కేటాయించిన పార్కింగ్ స్థలం లోనే తమ వాహనాలను పార్కింగ్ చేయగలరు.
పైన తెలిపిన సూచనలను ఎవ్వరైన అభ్యర్ధులు / ప్రధాన ఏజంట్లు / కౌంటింగ్ ఏజంట్లు దిక్కరించిన / ఇబ్బంది పెట్టిన వారిపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రకారం చర్యలు తీసుకోబడును