రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో 69వ జాతీయ మహాసభల గోడపత్రికల విడుదల
మెదక్ జిల్లా రామాయంపేట జూనియర్ కళాశాలలో ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో డిసెంబర్ 7,8,9,10 తేదీలలో ఢిల్లీలో జరిగే ఏబీవీపీ 69 వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వారు మాట్లాడుతూ జులై 9న ఏబీవీపీ 70 సంవత్సరాల సందర్భంగా 69వ జాతీయ మాసముగా నిర్వహించబోతుందని 70 ఏండ్ల కాలగమనంలో ఎన్నో ఉద్యమాలు నిర్వహించి 37 ఆర్టికల్ రద్దు, నూతన జాతీయ విద్యా విధానం కోసం విజయం సాధించింది. బంగ్లాదేశ్ నుంచి వచ్చే చొరబడ్డదారులను నియంత్రించడం కోసం అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ప్రపంచంలో నెంబర్ వన్ విద్యార్థి సంఘం ఎదిగింది.తెలంగాణప్రత్యేక రాష్ట్రం కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిందని తెలిపారు.ఈ అమృతకాలంలో తప్పక నిర్వహించే జాతీయ మహాసభలను విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ జాతీయ మహాసభలలో దేశవ్యాప్తంగా అత్యుత్తమ సేవ అందించిన యువకులను యశ్వంతరావు కేల్కర్ పేరిట అవార్డును ప్రధానం చేస్తారని తెలిపారు.దేశవ్యాప్తంగా నెలకొన్న చర్చించి తీర్మానాలు చేస్తారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జాలిగామ శివ .మహిళ కన్వీనర్ భవాని. పూజిత నాయకులు ప్రశాంత్. ప్రణయ్ .విష్ణు అశోక్. తదితరులు పాల్గొన్నారు.