*వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి*
పాకాల( స్టూడియో 10 న్యూస్ ) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం కేంద్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను చేపట్టిందని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ప్రధాని మోదీ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈ యాత్రలో ప్రతిబింబిస్తున్నాయని వివరించారు. కేంద్ర సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో శుక్రవారం పాకాల వేదికగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నిర్వహించారు. ముఖ్య అతిథిగా తుడా ఛైర్మెన్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. గడిచిన పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలు గ్రామస్థాయికి చేరాయన్నారు. అర్హులైన లబ్ధిదారులకు కేంద్ర పథకాలు సమర్థవంతంగా అందుతున్నాయని వెల్లడించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తోందన్నారు.అనంతరం అధికారులు మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, వాటి ఉపయోగాలు, ఎవరు వీటికి అర్హులు అనే పూర్తి సమాచారాన్ని అట్టడుగు స్థాయి వర్గాల ప్రజలకు వివరంగా చెప్పేందుకే ఈ కార్యక్రమం రూపొందిందన్నారు. వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళలకు డ్రోన్‌ల కార్యకలాపాలను విశదీకరించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.