క్రిష్ణా జిల్లా మోపిదేవి మండలం స్టూడియో 10 టివి న్యూస్
మోపిదేవి మండల పరిధిలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లి గ్రామంలో స్వయంభువుగా కొలువు తీరిన శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ నాగేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజున ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆలయ సహాయ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయంలో గురువారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, అమ్మవార్లకు మహిళా భక్తుల చేత ప్రత్యేక కుంకుమ పూజలు మధ్యాహ్నం నుంచి లక్ష బిల్వార్చన కార్యక్రమాలను ఆలయ వేద పండితులు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.
ప్రత్యేక పూజా కార్యక్రమాలలో సహాయ కమిషనర్ చక్రధరరావు, చల్లపల్లి సిఐ సిహెచ్ నాగప్రసాదులు పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గురువారం రాత్రి నిర్వహించిన అన్న సమారాధనను చక్రధరరావు, నాగప్రసాద్ లు ప్రారంభించారు.
శ్రీ స్వామివారి జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్ర మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు.