క్రిష్ణా జిల్లా మోపిదేవి మండలం స్టూడియో 10 టివి న్యూస్
మోపిదేవి వార్పు వద్ద గుండెపోటుతో మరణించిన యువకుని కుటుంబానికి అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతీదేవి ఆర్థిక సాయం అందించారు.
మోపిదేవి వార్పుకు చెందిన పరుచూరి యుగంధర్ గత కొద్ది రోజుల క్రితం గుండె పోటు కారణంగా మరణించారు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
సుమతి దేవి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తుంగల అంకాలరావు దంపతులు గురువారం సాయంత్రం రూ. పదివేల రూపాయల నగదును మృతుని కుమారుడు కుమార్తెకు అందజేశారు.