Reporter-Silver Rajesh Medak.తేదీ 29-11-2023
ఇద్దరు ఉద్యోగులు సస్పెండ్ గ్రామం లో నీటి సరఫరా చేసేఉద్యోగి /అటెండర్ సస్పెండ్. — జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ రాజర్షి షా
తెలంగాణ రాష్ట్ర సాధారణ ఎన్నికలు 2023 – ఎన్నికలలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కేంద్ర / రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి / కలెక్టర్ రాజర్షి షా అన్నారు . కూల్చారం మండలo లోని, పైతరా గ్రామం లో గ్రామo లో నీటి సరఫరా చేసే ఉద్యోగి బట్ట జీవయ్య. ఎన్నికల నియమావళి కి విరుద్ధం గా రాజకీయ పార్టీలో చేరి ప్రచారం చేస్తూ విధులను నిర్లక్ష్యం చేశాడని C- విజిల్ ఆప్ లో పిర్యాదు అందింది, వచ్చిన పిర్యాదు పై ఉన్నత శాఖల అధికారులు విచారణ చేయగా విచారణ లో వచ్చిన పిర్యాదు నిజమేనని తేలడం తో సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు .మసాయిపేట లోని పశు సంవర్ధక శాఖ లోని ప్రాథమిక కేంద్రం లో అటెండర్ గా విధులు నిర్వహిస్తున్న కె . విద్య సాగర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా గ్రామం లో రాజకీయ పార్టీ నిర్వహిస్తున్న ప్రచారం లో ఖండువ తో ప్రచారం చేశారని ,వీడియో రికార్డ్ తో పిర్యాదు చేశారు. వివిధ శాఖ అధికారులతో నిర్ధారణ చేయగా ,నిర్ధారణలో ఎన్నికల నియమావళి 2023 నియమావళి ఉల్లంఘించినట్లు రుజువైనందున సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు , రాజకీయ ప్రచారాలలో పాల్గొనకూడదని, ఎన్నికల విధులలో నిర్లక్ష్యం వహిస్తే సి సి ఏ రూల్ , ఎన్నికల నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవలసివస్తుందని బుదవారం ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.