Reporter -Silver Rajesh Medak.
జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.
29.11.2023.
ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందితో పోలీసు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలి .
ఎన్నికలు సజావుగా, ప్రశాంతమైన వాతావరణంలో జరుగుటకు ఎన్నికల విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది కృషి చేయాలి
ఈనెల 30 న (రేపు) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు మెదక్ జిల్లా మెదక్ బాయ్స్ జూనియర్ కాలేజీ మరియు నర్సాపూర్ లోని BVRIT కాలేజ్ నందు ఎన్నికల విధులకు వెలుతున్న పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేసిన జిల్లా ఎస్.పి శ్రీమతి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.ఎస్ గారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి గారు మాట్లాడుతూ… జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా శాంతియుతంగా నిర్వహించుటకు ప్రతి ఒక్క పోలీస్ అధికారి మరియు సిబ్బంది కృషి చేయాలని అన్నారు. విధి నిర్వహణలో ఉన్న ఎన్నికల సిబ్బందికి మరియు పారా మిలిటరీ సిబ్బందితో జిల్లా పోలీస్ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఓటర్లు క్యూలైన్లు పాటించే విధంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని అన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే వారు, ఓటర్లను ప్రలోభపెట్టే వారిపై నిఘా పెట్టాలని శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, ఎవరైనా ఎన్నికల ఉల్లంఘనకు పాల్పడినట్లయితే తక్షణమే సంబంధిత పై అధికారులకు తెలపాలని అన్నారు. ఓటర్లకు భరోసా కలిగించే విధంగా ఎన్నికల విధులు పారదర్శకంగా నిర్వహించాలని పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి పలు సూచనలు చేయడం జరిగింది అనంతరం చిలిపిచేడ్ పోలీస్ స్టేషన్ పరిదిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను ఆకస్మిక తనిఖీ చేసి అక్కడి సిబ్బందికి ఎన్నికల సమయంలో చేయాల్సిన విదులను గూర్చి తెలిపినారు.