-జ్యోతిరావ్ ఫూలే అశయాలను నేటితరం యువత కొనసాగించాలి
-బీసీల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి
-అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్
బహుజనలకు విద్యనందించి వారి జీవితాల్లో వెలుగు నింపిన మహానీయుడు జ్యోతిబా ఫూలే అని చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సున్నపు ప్రవీణ్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చేవెళ్ల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అణగారిన వర్గాల ప్రజలకు విద్యాబోధన చేసిన మహనీయుడు జ్యోతిరావ్ ఫూలే అని, ఆయన అశయాలను నేటితరం యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే అని,బీసీల అభివృద్ధికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పూలే ఆలోచనలతో ప్రభావితమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారతదేశ కుల వ్యవస్థ మీద అధ్యయనం చేసి భారత రాజ్యాంగాన్ని అందించారన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తమ జీవితంలో మహాత్మా జ్యోతిరావు పూలేని గురువుగా ప్రకటించుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బ్యాగరి ప్రభాకర్, ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం చేవెళ్ల అధ్యక్షుడు మల్లెపల్లి శ్రీనివాస్, చేవెళ్ల అంబేద్కర్ సంఘం సభ్యులు మద్దెల జంగయ్య, రవీందర్, బ్యాగరి అజయ్, బ్యాగరి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.