శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్ ప్రజలకు భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్

Reporter -Silver Rajesh Medak.

జిల్లా పోలీసు కార్యాలయం,
మెదక్ జిల్లా.

28.11.2023.

శాంతి భద్రతల పరిరక్షణకే ఫ్లాగ్ మార్చ్ ప్రజలకు భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్ ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనది ఎవరైనా వ్యతిరేఖ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు. శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ .

ఈ రోజు మెదక్ జిల్లా ఎస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆదేశానుసారం మెదక్ డి.ఎస్.పి శ్రీ. శ్రీ.ఫణీంద్ర గారి ఆద్వర్యంలో మెదక్ పట్టణంలో కేంద్ర బలగాల బృందంతో కలిసి కవాతు నిర్వహించారు. అలాగే తూప్రాన్ డి.ఎస్.పి యాదగిరి రెడ్డి ఆద్వర్యంలో నర్సాపూర్ పట్టణంలో కేంద్ర బలగాల బృందంతో కలిసి కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి.పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ మాట్లాడుతూ…. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ చాల కీలకమైనదని, ఎవరైనా వ్యతిరేఖ చర్యలకు పాల్పడితే పోలీస్ పరంగా చాల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చట్టం ముందు అందరూ సమానమే. ప్రత్యేక మినహాయింపులు ఎవరికీ ఉండవన్నారు. భారత ఎన్నికల సంఘంచే జారీ చేయబడిన నియమాలను పక్కగా అమలు చేస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు నిత్యం ప్రజల వెన్నంటి ఉన్నారని నమ్మకం కల్పించడమే ఫ్లాగ్ మార్చ్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదురైనా, శాంతి భద్రతలకు విఘాతం కలిగే పరిస్థితులు ఏర్పడినా నిర్భయంగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలిగినా ప్రజలలో భరోసా, ధైర్యం కల్పించడం, పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణ కల్పించడం, శాంతియుత వాతావరణం నెలకొల్పడమే లక్ష్యంగా నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్నదని చెప్పారు. ప్రజలకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పని చేసే పోలీసులకు ప్రజలు తమవంతు సహకారం అందించాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పోలీసులు నిరంతరం వారి వెన్నంటి ఉంటారన్న భరోసా కల్పించడం లక్ష్యంగా పోలీసులు పని చేస్తున్నారని చెప్పారు. పోలీస్ శాఖ ప్రజలకు నిరంతరం వెన్నంటి ఉన్నామని చెప్పడం, వారికి పోలీస్ వ్యవస్థపై మరింత నమ్మకం కల్పించడానికే కవాతు నిర్వహించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ సిఐ శ్రీ.వెంకట్,పట్టణ ఎస్.ఐ .పోచయ్య, నర్సాపూర్ సిఐ షేక్ లాల్ మదర్ ,నర్సపూర్ ఎస్.ఐ శివ కుమార్ ,కేంద్ర బలగాలు మరియు రెండు పట్టణాల పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!