క్రిష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం స్టూడియో 10 టీవీ న్యూస్
చల్లపల్లి సిటీకేబుల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తూ ఇటీవల మరణించిన కల్లేపల్లి చంద్ర మరణ విషయాన్ని తెలుసుకున్న పెనమలూరు నియోజకవర్గం పాత్రికేయుల సంక్షేమ సంఘం సభ్యులు ఈరోజు ఉదయం చంద్ర కుటుంబ సభ్యులను వారి నివాసం వద్ద కలుసుకొని, తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేసి, తమ వంతు సాయంగా 10 వేలు రూపాయలు ఆర్థిక సహాయాన్ని స్థానిక చల్లపల్లి సీ.ఐ సి.హచ్. నాగ వరప్రసాద్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఈ సందర్భంగా పెనమలూరు పాత్రికేయ సంక్షేమ సంఘం కుటుంబానికి అండగా ఉంటుందని తెలియజేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు మరీదు రాజా, ప్రధాన కార్యదర్శి సి.హెచ్. అజయ్, సంఘ ప్రతినిధులు వంపుగడవల జానీ, జే. వెంకటప్పయ్య, కె. దిలీప్ కుమార్, కిషోర్ కుమార్, పి. రాజేష్, బి. రమేష్, స్థానిక జర్నలిస్టు సాయి తదితరులు పాల్గొన్నారు.