క్రిష్ణా జిల్లా నాగాయలంక మండలం స్టూడియో10 టీవీ న్యూస్
మత్సకారుల సంక్షేమాన్ని గాలికొదిలేసి మత్సకార దినోత్సవాన్ని జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్వహించడం విడ్డురంగా ఉందని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నాగాయలంక లో ఫిష్ ల్యాండింగ్ పనులు నిలిపివేసి, జలక్రీడల కేంద్రాన్ని మటుమాయం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని బుద్ధప్రసాద్ విమర్శించారు.
రాష్ట్రంలో 20 లక్షలమంది మత్సకారులు ఉంటే మత్సకార భరోసా కేవలం లక్ష మందికి మాత్రమే పరిమితం చేసారని ఆయన అన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం మత్సకారులకు వలలు, పడవలు, ఐస్ బాక్సులు, మోటారు సైకిళ్ళు, ఆటోలు, వ్యానులు 70-90 శాతం సబ్సిడీ లో అందిస్తే ఆ స్కీములన్నీ నేడు ఏమయ్యాయని అన్నారు. చెరువులు, రిజర్వాయర్లలో చేపపిల్లలు వదిలే పథకాన్ని నిర్వీర్యం చేసారని అన్నారు.
జీవో 217 ద్వారా ఫిషర్ మెన్ సొసైటీల ఆధ్వర్యంలో ఉన్న రిజర్వాయర్లకు వేలం వేసి సొసైటీలను నిర్వీర్యం చేశారు.
మత్సకారులు నివసించే తీరప్రాంత గ్రామాల రహదారులు అధ్వాన్నస్థితిలో ఉన్నాయని, సాగునీటి, త్రాగునీటి సమస్యలతో తల్లడిల్లిపోతుంటే పట్టించుకున్న పాపాన పోలేదని బుద్ధప్రసాద్ విమర్శించారు.
ఆక్వా రంగంలో విద్యుత్ చార్జీలను తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు రూపాయలకు తగ్గిస్తే, నేడు ఆక్వా జోన్ – నాన్ ఆక్వా జోన్ అంటూ రూ.5 – 8.5 వరకు వసూలు చేస్తున్నారని, చంద్రబాబునాయుడు పాలనలో ఏరియేటర్లు, బోర్లు, మోటర్లపై 50% సబ్సిడీ ఇస్తే నేడు ఎగ్గొట్టారని, ఆక్వా ఉత్పత్తులు కిలోకి పావలా గా ఉన్న సెస్సుని రూపాయి చేసారని, తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆక్వా రైతులందరికీ రూ.1.50 కి యూనిట్ విద్యుత్ ఇస్తామని ఆయన అన్నారు. మత్సకారవర్గానికి చెందిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై 2 తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని బుద్ధప్రసాద్ పేర్కొన్నారు.