క్రిష్ణా జిల్లా మోపిదేవి మండలం స్టూడియో 10 టీవీ న్యూస్
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేదల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
మోపిదేవి మండల పరిధిలోని పెదప్రోలు గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన పల్లెకి పోదాం కార్యక్రమంలో రమేష్ బాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఎండిఓ శ్రీనివాసరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి గ్రామ సచివాలయ పరిధిలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన బోర్డులను ఆవిష్కరించారు. 4,69,459.45 కోట్లు సంక్షేమ పథకాలకు అలాగే అభివృద్ధి పనులకు రూ. 2,47,56,920 లు వెచ్చించినట్లు పంచాయతీ కార్యదర్శి కొల్లిపర రామ కోటేశ్వర రావు తెలిపారు.
పిఎసిఎస్ చైర్ పర్సన్ ఆది రాంబాబు పర్యవేక్షణలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యక్రమ నోడల్ అధికారి దుర్గాప్రసాద్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గరికిపాటి వెంకటేశ్వరరావు ( బుల్లి ), గ్రామ సచివాలయాల మండల కన్వీనర్ కోసూరు శివనాగమల్లేశ్వర రావు, మండల పార్టీ మహిళా విభాగం కన్వీనర్ పరమేశ్వరి, మండల ఎస్సీ సెల్ కన్వీనర్ చోడాబత్తిన పూర్ణచంద్రరావు, ప్రముఖ న్యాయవాది ఆకుల వెంకట్రామయ్య, గ్రామ పార్టీ కన్వీనర్ జన్యావుల రాము, గ్రామ సచివాలయ కన్వీనర్ గొరిపర్తి రవికాంత్ యాదవ్ లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, మండలస్థాయి పార్టీ నేతలు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.