చల్లపల్లికి చెందిన జర్నలిస్ట్, దివంగత కళ్లేపల్లి చంద్ర కుటుంబాన్ని ఆదుకునేందుకు చల్లపల్లి మండలం మంగళాపురం గ్రామ సర్పంచ్, ప్రముఖ సేవా తత్పరులు డొక్కు నాగేశ్వరరావు ఈరోజు రూ.5వేలు ఆర్ధిక సహాయాన్ని చల్లపల్లి అగ్రహారంలో ఉన్న వైసీపీ కార్యాలయంలో చల్లపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పేరం మధుసూధన రెడ్డికి అందచేశారు. వెంటనే స్పందించిన వైసీపీ నాయకుడు పరుచూరి వెంకన్నబాబు రూ.వెయ్యి ఆర్ధిక సహాయం అందచేశారు. కార్యక్రమంలో చల్లపల్లి మండల విలేఖరులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.