క్రిష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం స్టూడియో10 టీవీ న్యూస్
నాలుగున్నర సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు.
అవనిగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం రమేష్ బాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
ఇటీవల పులిగడ్డలో వైసీపీ జెండా దగ్ధం చేసి జనసేన పార్టీ జెండా ఎగురవేశారని, తాజాగా అవనిగడ్డ లంకమ్మ మాన్యంలో వైసీపీ జెండా దిమ్మ ధ్వంసం చేశారని తెలిపారు. టిడిపి ఇన్చార్జ్ మండలి బుద్ధ ప్రసాద్ ప్రోత్సాహంతోనే ఇవన్నీ జరుగుతున్నాయని ఎమ్మెల్యే రమేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.