వైసిపి ప్రభుత్వంతోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 15, మహానంది:
వైసిపి ప్రభుత్వంతోనే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలని జెడ్పిటిసి కెవిఆర్ మహేశ్వర్ రెడ్డి అన్నారు.బుధవారం మహానంది మండలం గాజులపల్లె గ్రామంలోని సచివాలయం 1 వద్ద పల్లెకు పోదాం కార్యక్రమం సర్పంచ్ చంటి అధ్యక్షతన వైసిపి నాయకులు కొండా మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.అనంతరం సచివాలయం పరిధిలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పధకాల పట్టిక బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పాలనలో సంక్షేమ పథకాలు ఎప్పుడు అందేవి కాదని, వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని,ఈ విషయంలో ప్రజలందరూ గమనించాలన్నారు.ఈ సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధి ఇలానే జరగాలంటే మరల మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఇన్ని సంవత్సరాలలో సంక్షేమ పథకాలు తీసుకువెళ్లిన ఘనత ఒక జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఏ సంక్షేమము అందించారో, ఒకసారి అవకాశం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి ఏ సంక్షేమ పథకాలు అందించారో గమనించి, మళ్ళి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు. జగనన్న ప్రభుత్వం గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్టీ,ఎస్సీ,బీసీ,మైనార్టీ,వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేయూతని అందిస్తూ వచ్చిందని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే పథకాలన్నీ అమలు అవుతాయని అన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రజల సల్లని దీవెనలు పొందుతున్నారని అన్నారు. అనగారిన వర్గాలకు అండగా ఉండాలని, సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని, సామాజిక వర్గాలకు ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అన్నారు.ఈ కార్యక్రమంలో మహానంది దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్, మండల వైసీపీ కన్వీనర్ కొమ్మా మహేశ్వర్ రెడ్డి,ఎంపిడివో శివ నాగజ్యోతి,ఎపివో మనోహర్, వైసిపి నాయకులు గజ్జ పెద్ధపక్కీరయ్య,రవి స్వామి, బోజ్జయ్య, రమణ, మహానంది ట్రస్టు బోర్డు మెంబర్ గజ్జ సంపూర్ణ, లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శులు మహమ్మద్ ఇర్ఫాన్, శ్రీనివాసులు, సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.