చర్చకు మేము సిద్దం.. మీరు సిద్దమా…
ములుగు గడ్డ మీద తేల్చుకుందాం రండి.. మీ సతీష్ రెడ్డిని మీరు తీసుకురండి.. మా సీతక్క గారిని మేము తీసుకువస్తాం…
మా అక్క ఏమన్నదో, ఎవరితో ఏమన్నదో ఋజువులతో రండి..
ఆధారాలు లేని నిందలు వేయడం కాదు… ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు మేము సిద్దం…
ఆధారాలు లేని విమర్శలు చేస్తే సహించేది లేదు.. నిరాధార ఆరోపణలతో పైశాచిక ఆనందాన్ని పొందుతున్న నాయకులకు సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ ములుగు ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ గారు…
తేదీ: 16.11.2023 గురువారం అనగా ఈరోజున గోవిందరావుపేట మండల పస్రా గ్రామంలోని గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్ గారు విచ్చేసి దమ్ముంటే ఋజువులతో రండి మేము చర్చకు సిద్దం మీరు కూడా సిద్దం అయితే రండి ములుగు గడ్డ మీద తేల్చుకుందాం రండి అని బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులకు సవాల్ విసిరారు.
ఈ సందర్భముగా సుధాకర్ గారు మాట్లాడుతూ రెడ్ కో చైర్మన్ సతీష్ రెడ్డి దేవగిరిపట్నం గ్రామంలో మాట్లాడుతూ సీతక్క గారు బెదిరిస్తున్నారు అని అసత్య ఆరోపణలు చేశారు. దానికి వారి గులాబీ దళం సోషల్ మీడియా నాయకులు స్పందించి చర్చకు రండి అని అన్నారు. మేము అంటున్నాం చర్చకు మేము సిద్దం దమ్ముంటే ఋజువులతో రండి ములుగు గడ్డ మీద తేల్చుకుందాం అని బి.ఆర్.ఎస్.పార్టీ నాయకులకు సవాల్ విసిరారు. కావాలని సీతక్క గారిని విమర్శించడం కాదు దైర్యం ఉంటే రుజువులు, ఆధారాలు పట్టుకు రండి అని అన్నారు. బెదిరించే రాజకీయాలు మేము చేసింది లేదు కానీ మీరు సామాన్యులను బెదిరించి బి.ఆర్.ఎస్.పార్టీలో ఉంటేనే దళిత బంధు ఇస్తాం, గృహలక్ష్మి ఇస్తాం అని బెదిరింపు రాజకీయాలు చేసేది మీరు అని ప్రజలందరికి తెలుసు అని అన్నారు. ఓటమి భయం పట్టుకున్న బి.ఆర్.ఎస్. నాయకులు సీతక్క గారిపై నిందలు వేసి ప్రజల మనసు గెలుచుకోవాలని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వానికి ప్రతీక అని అన్నారు. ఇప్పటికీ అయిన నిజాలు మాట్లాడడం నేర్చుకోండి, మీరు చేసే సేవలు కానీ, ప్రజల కోసం చేసే పనులు కానీ సోషల్ మీడియాలో పెట్టుకుని ప్రజల మనసులు గెలవండి అంతేకాని ఇంకొకరిని దూషిస్తూ అభిమానం సంపాదించుకోవాలనుకోవడం వారి నీచ బుద్దిని బయటపెడుతుంది అని అన్నారు. ఓటమి భయంతో ఎమ్మెల్సీ, రెడ్ కో చైర్మన్ ఇంచార్జులతో డబ్బుల మూటలు పట్టుకుని తిరుగుతున్నారు అని ప్రజలందరికి తెలుసు, ప్రజల కష్టాల్లో ఎప్పుడు కనపడని ఇంచార్జులు ఇప్పుడు ఓట్ల కోసం నాటకాలాడితే ఓట్లు పడతాయా, ఒక గిరిజన ఎమ్మేల్యే, ఒక ప్రతిపక్ష ఎమ్మేల్యే అయిన సీతక్క గారిని ఓడించడానికి ఎన్ని పగటి వేషాలు వేస్తున్నారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు కూడా మీకు నవంబర్ 30 వ తారీకున చేతి గుర్తు మీద ఓటు వేసి మీకు సరైన బుద్ది చెపుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.