పుస్తకం వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుంది
-మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 15, మహానంది:
పుస్తకం వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందని మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య అన్నారు. బుధవారం మహానంది మండలం తిమ్మాపురం గ్రామంలో గ్రంధాలయ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తక పరిశీలన కార్యక్రమాన్ని గ్రంథాలయాధికారి రవిరాజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి రామసుబ్బయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుస్తకం వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందిస్తుందన్నారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో మంచి పుస్తకాన్ని కొనుక్కో అని, సామాజిక ఉద్యమ కార్యకర్త కందుకూరి వీరేశలింగం పంతులు తెలిపారని, ప్రతి వ్యక్తి పుస్తకాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. మానవ విజ్ఞానానికి ఆలంబనగా ఉన్న చదువును విద్యార్థులు చదివి మంచి క్రమశిక్షణతో భావి జీవితాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్, దూదేకుల చంద్రమౌళీశ్వరుడు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.