కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహిళకు 500 కే గ్యాస్ సిలిండర్…..
ఎన్నికలు రాగానే మిడుతల దండుగా వస్తున్న రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ నాయకులు…..
ఘనంగా పూలమాలలతో , డోలు సన్నాయి వాయిద్యాలతో , బోకెలతో , శాలువాలతో , ఘన స్వాగతం పలికిన ప్రజానీకం , మహిళా సోదరీమణులు…..
తాడ్వాయి మండలం లో ఉన్న గ్రామాలలో ఏర్పాటు చేసిన ఇంటింటి ప్రచారానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క ….
తేది:- 15.11.2023 బుదవారం అనగా ఈ రోజున ఎన్నికల ప్రచారం లో భాగంగా తాడ్వాయి మండలం లో ఉన్న బంజారా , గంగారం పాతూరు, కాలనీ , రాంగాపూర్ , ఎస్సి కాలనీ , వీరాపూర్ , బీరెళ్ళి , ఆశన్నగుడెం , ఎల్లపూర్ , కామారం , అంకంపల్లి , కౌషేట్టి వాయి , నర్సాపూర్ , ఐలాపూర్ , పంబాపూర్ , చితలగుంపు , దామరావాయి , భూపతి పూర్ , కాటాపూర్ , గ్రామాలలో తాడ్వాయి మండల అధ్యక్షులు బోల్లు దేవేందర్ ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ములుగు ఎమ్మెల్యే సీతక్క….
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ములుగు ఎమ్మేల్యే అభ్యర్థి మాట్లాడుతూ గత ఎన్నికలలో ప్రచారానికి వచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాడ్వాయి మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఎంపిటిసి కి 200 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తానని చెప్పారు. జెడ్పీటీసీ గా గెలిచిన తరువాత మండలానికి ఒక్కసారి కూడ వచ్చింది లేదని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మంత్రులు , నాయకుల హామీలన్నీ మాటలకే తప్ప అభివృద్ది మాత్రం శూన్యం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ , పోడు భూములకు పట్టాల కోసం ఎన్నో సార్లు అసెంబ్లీ లో మాట్లాడితే ఈరోజు సీతక్క ఏం చేసింది అని అంటున్నారు. కష్టం వచ్చిన కరోనా వచ్చిన కన్నీళ్లు వచ్చిన మీకు అండగా ఉన్నది నేను ఓట్లు రాగానే వచ్చి మాయమాటలు చెప్పి ఓట్లు దండు కావాలని చూస్తున్న బిఆర్ఎస్ నాయకులను నమ్మి మరోమారు మోసపోవద్దు గడిచిన 10 యేండ్ల కెసిఆర్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలే , డబుల్ బెడ్ రూం ఇవ్వళే , దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలే , ఫీజ్ రీయంబర్స్ మెంట్ ఇవ్వాళే , రైతు రుణమాఫీ చేయాలే , ఇన్ని చెయ్యని వాళ్ళు మళ్ళీ గెలిస్తే చేస్తాం అని అంటే ప్రజలు నమ్మరు కారు పోవాలి కాంగ్రెస్ రావాలి…..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
- రైతు భరోసా ద్వారా ఉచిత విద్యుత్, 2 లక్షల రైతు రుణమాఫి, ప్రతి ఏటా పట్టాదారులకు 15000/- రూపాయలు, కౌలు రైతులకు 12000/- రూపాయలు, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అను సంధానం చేసి వ్యవసాయాన్ని పండుగ చేస్తాం అని అన్నారు.
- గృహ జ్యోతి పథకం ద్వారా మహిళలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని అన్నారు.
- మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు నెలకు 2500/- రూపాయలు అందిస్తామని అన్నారు.
- చేయూత పథకం ద్వారా వృద్దులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు మరియు బీడీ కార్మికులకు ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ 4000/- రూపాయల పెన్షన్ అందిస్తామని అన్నారు.
- యువ వికాసం ద్వారా విద్యార్థులకు ఫీజ్ రీ ఇంబర్శుమెంట్ అందించి పేద విద్యార్థులందరికీ ఉచిత ఉన్నత విద్యను అందించి 5 లక్షల రూపాయల వరకు విద్యార్థులకు అందిస్తామని అన్నారు.
- రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఏటా 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని అన్నారు.
ఈ ఆరు గ్యారంటీ పథకాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని హామీలు ఇచ్చి ప్రతి ఇంటికి ప్రచారాన్ని నిర్వహించారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. అసలు బి.ఆర్.ఎస్.పార్టీ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కావట్లేదని, పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు….
ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు , మండల నాయకులు , సర్పంచులు , సహకార సంఘం చైర్మన్ , మాజీ చైర్మన్లు , మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు , సింగిల్ విండో డైరక్టర్లు , అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు , ఎంపిటిసిలు , మాజీ ఎంపిటిసి లు , మహిళా నాయకురాల్లు , యువతీ , యువకులు , ఉపసర్పంచులు , గ్రామ నాయకులు , ప్రజాప్రతినిధులు , నాయకులు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.