ములుగు జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జనరల్ ఉన్న స్థానాన్ని ఎస్టీ స్థానంగా మార్చింది మీరే అని మరిచిపోయినట్టు ఉన్నావ్…
కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ మూత పడేలా చేసింది మీరే గిరిజన మంత్రిగా మీ నాన్న గారు ఉన్నప్పుడు ఫ్యాక్టరీ ఉద్యోగి చచ్చిపోతే పరామర్శించడానికి కూడా రాలేని పరిస్థితి మీది…
సీతక్క గారు ఉద్యోగి కోసం ప్రభుత్వంపై పోరాటం చేసింది మంగపేట మండల ప్రజలకు తెలుసని, నీ కపట నాటకాలు బందు చేయాలి..
సీతక్క గారి రాజకీయ చరిత్రలో ఏనాడూ ఎస్టీ పేరు చెప్పుకుని ఎవరి భూములు గుంజుకున్న చరిత్ర లేదు..
అదే నువ్వు గ్యాస్ గోడౌన్ కోసం మీ నాన్న గారు మంత్రిగా ఉన్నప్పుడు రోడ్డు పక్కన ఉన్న బీసీల భూమిని అక్రమంగా వాళ్ళని బెదిరించి లాక్కున్న సంగతి మాకు తెలుసు..
సీతక్క గారి గురించి మాట్లాడే స్థాయి నీకు ఉందా ఒకసారి గుర్తుంచుకో..
అన్ని వర్గాల ప్రజలకు సాగు పట్టాలు అందించడమే లక్ష్యంగా సీతక్క గారు ముందుకు సాగుతున్నారు అని అంటున్న మంగపేట మండల సీతక్క యువ సేన అధ్యక్షులు సిద్దబత్తుల జగదీశ్వర్ రావు గారు…
గిరిజనుల పేరు చెప్పుకుని భూములు లాక్కున్న చరిత్ర సీతక్క గారికి లేదని, మీ నాన్న గారు ములుగు ఎమ్మేల్యేగా గిరిజన మంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ జనరల్ ఉన్న స్థానాన్ని ఎస్టీగా మార్చి మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకున్న వ్యక్తులు మీరు అని అన్నారు. గిరిజనుల పేరు చెప్పుకుని గోవిందరావుపేట మండల కేంద్రంలోని కవిట్ల కాలువ పక్కన ఉన్న బీసీల భూమిని బెదిరించి గున్జుకున్న చరిత్ర మీది అని భాజాపా పార్టీ ములుగు ఎమ్మేల్యే అభ్యర్థి అజ్మీర ప్రహ్లాద్ గారిని మంగపేట మండల సీతక్క యువ సేన మండల అధ్యక్షులు సిద్ధబత్తుల జగదీశ్వర్ రావు గారు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతుంది అని, సీతక్క గారు మాత్రమే అన్ని వర్గాల ప్రజలకు సాగు పట్టాలు, పోడు పట్టాలు అందించాలని అసెంబ్లీలో మాట్లాడింది అని, అలాంటి సీతక్క గారిపై ఓట్ల కోసం అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. కనీసం కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరీ మూసివేస్తే కూడా అధికార పార్టీలో కేబినెట్ మినిస్టర్ హోదాలో ఉండి కూడా కనీసం బిల్ట్ కార్మికులకు మద్దతు కూడా అందించలేదు అని, బిల్ట్ ఫ్యాక్టరీ మూసివేతకు కారణం మీరే అని అందరికీ తెలుసు అని, కనీసం బిల్ట్ కార్మికుడు చనిపోతే కూడా పరామర్శించడానికి కూడా రాని మీరు సీతక్క గారి గురించి మాట్లాడుతున్నారు అని ఎద్దేవా చేశారు. అదే సీతక్క గారు బిల్ట్ కార్మికుడు చనిపోతే నడి రోడ్డుపై ఐదు గంటల పాటు ధర్నా చేసి వారి కుటుంబానికి సహాయం చేయడానికి తన వంతు కృషి చేసిందని అన్నారు. బీజేపీ పార్టీ చేతిలోనే అటవీ అధికారులు ఉన్న కానీ, వారిని ఉసి గొల్పి పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయకుండా, పోడు భూముల్లోకి రైతులను దిగనివ్వకుండా అక్రమ కేసులు బనాయించి, అక్రమ అరెస్టులు చేసిన ఘనత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే అని అన్నారు. ఇప్పటికీ అయిన ప్రజలారా ఆలోచించండి మనకు పట్టాలు రావాలన్న, అటవీ అధికారులు మన భూముల్లో వేసిన ఫెన్సింగ్ తొలగిపోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నదని కావున మన కష్ట, నష్టాల్లో మన కోసం పోరాటం చేసే సీతక్క గారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్న అని అన్నారు.