హత్యా రాజకీయాలు చేసింది, చేసేది నువ్వు…
ఎన్ని హత్యలు చేస్తే నువ్వు ఆ కార్లలో తిరుగుతున్నావు మాకు తెలుసు…
నువ్వు ప్రజా సేవ చేస్తున్నావా.. ఏం ప్రజా సేవ చేశావ్ చెప్పు…
సీతక్క గారు నిన్ను అన్నారా.. అబద్దాలతో కట్టు కథలు చెబితే నమ్మే పరిస్థితిలో ములుగు ప్రజలు లేరు…
బి.ఆర్.ఎస్.పార్టీని బొందలో పెట్టడమే ప్రజల లక్ష్యం…
మొన్నటి దాకా ములుగు ప్రజల కష్టాల్లో కనపడని నువ్వు ప్రజా సేవ చేస్తున్నావా సిగ్గు చేటు..
కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు నీ బ్రతుకు ఏంటో అందరికీ తెలిసిందే.. హత్యా రాజకీయాలు చేసే బి.ఆర్.ఎస్.పార్టీకి రాగానే టాప్ ఎండ్ కార్లు ఎలా వచ్చాయి సతీష్ రెడ్డి…
ఓటమి భయంతో బి.ఆర్.ఎస్. పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు…
నీకు నిజంగా సిగ్గు ఉందా సతీష్ రెడ్డి గ్రూప్ 1 పేపర్లు మూడు సార్లు లీక్ అయితే మాట్లాడని దద్దమ్మలు మీరు నువ్వు కూడా మాట్లాడుతున్నావా అని ప్రశ్నించిన INTUC జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి గారు…
తేదీ: 15.11.2023 బుధవారం అనగా ఈరోజున తాడ్వాయి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ములుగు జిల్లా నాయకులు అర్రెం లచ్చుపటేల్ గారి ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయగా అట్టి సమావేశానికి ముఖ్య అతిథిగా INTUC జిల్లా అధ్యక్షులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి గారు విచ్చేసి సతీష్ రెడ్డి కావాలని సీతక్క గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నాయని, హత్యా రాజకీయాలు చేసేది నువ్వని, ఎన్ని హత్యలు చేస్తే నీకు ఇన్ని సోకులు వచ్చాయో ప్రజలందరికి తెలుసు అని అన్నారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ సతీష్ రెడ్డి బి.ఆర్.ఎస్.పార్టీ ఓడిపోతుందనే భయంతో అసత్య ఆరోపణలకు దిగాడని, హత్యా రాజకీయాలు చేసేది ఎవరని ములుగు ప్రజలకు తెలుసని, గత ఐదు ఏండ్ల క్రితం నీ బ్రతుకు ఏంది అనేది ప్రజలకు తెలుసని, ఇప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అందరికీ తెలుసు అని, ఎన్ని హత్యా రాజకీయాలు చేస్తే నువ్వు ఈ స్థాయికి వచ్చావు, నువ్వు పడుతున్న సాకులు, నువ్వు తిరుగుతున్న కార్లు అన్ని హత్యా రాజకీయాలు చేస్తే వచ్చినవే అని అందరికీ తెలుసు అని, ఇంకొక సారి సీతక్క గారి గురించి అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. సీతక్క నిస్వార్థ ప్రజా సేవకురాలు, ప్రజా సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడిన గొప్ప వ్యక్తి తను అలాంటి సీతక్క గారిపై ఆరోపణలు చేయడం నిజంగా సిగ్గు చేటని అన్నారు. ఓటమి భయంతో బి.ఆర్.ఎస్. నాయకులు ప్రజలను డైవర్ట్ చేయడానికి కల్పిత ప్రచారాలు చేస్తున్నారని, కానీ దొంగ మాటలు నమ్మే స్థితిలో ములుగు ప్రజలు లేరని, ములుగు ప్రజలు చాలా చైతన్య వంతులని మీ నక్క జిత్తులను తిప్పి గొట్టి సీతక్క గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని అన్నారు. కనీసం విద్యార్థుల భవిష్యత్తు గురించి కూడా ఒక్క మాట మాట్లాడని మీరు, నిరుద్యోగులు కొన్ని ఏండ్ల నుండి గ్రూప్ పరీక్షలకు కుటుంబాలను వదిలి పట్టణాల్లో సిద్ధమైతే పేపర్ లీకేజీలు చేసి నిరుద్యోగులను గోస పెడుతున్న ఒక్కసారి కూడా వారి భవితకు భరోసా కల్పించని వ్యక్తివి నువ్వని అన్నారు. ఇప్పటికీ అయిన ప్రజలు మేల్కొవాలి అని మన పిల్లల బంగారు భవిష్యత్తుని గత పది సంవత్సరాలుగా నాశనం చేసిన బి.ఆర్.ఎస్.పార్టీని గద్దె దింపి సతీష్ రెడ్డి గారిలా దొరల దగ్గర అమ్ముడుబోయిన నాయకులను తరిమికొట్టాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.