ఓటర్ సమాచార స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన, జిల్లా ఎన్నికల సాదారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ బీపీ, ఐఏఎస్.

సాధారణ ఎన్నికల్లో భాగంగా, 034- మెదక్ నియోజవర్గ పరిధిలో బుధవారం, హవేలీ ఘనపూర్ మండలం, సుల్తాన్పూర్ గ్రామంలో జిల్లా ఎన్నికల సాదారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ బి పి, ఐఏఎస్. ఓటర్ సమాచార స్లిప్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఓటర్ స్లిప్ తోపాటు ,ఓటర్ గైడ్, C -విజిల్ కరపత్రాలు ప్రతి ఓటర్ కి అందించాలని అధికారులకు జిల్లా ఎన్నికల సాదారణ పరిశీలకుడు పృథ్వీరాజ్ బి పి, ఐఏఎస్ . సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా పారదర్శకంగా ఓటు వేయాలని ప్రజాస్వామ్యం లో ఓటు చాలా విలువైనదని, రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రతి ఒక్కరు తప్పనిసరిగా. వినియోగించుకోవాలని అన్నారు . ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడానికి ప్రతి ఒక్కరు C-విజిల్ యాప్, టోల్ ఫ్రీ నెంబర్ 1950 పై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈనెల 30న జరిగే పోలింగ్ రోజు ప్రతి ఒక్కరు తమ ఓటు ను నిర్భయంగా, తప్పనిసరి గావినియోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో మెదక్ ఆర్ ఓ / ఆర్ డి ఓ అంబాదాస్ రాజేశ్వర్ ,ఏఆర్ఓ నారాయణ ,డి టి చరణ్, బి ఎల్ ఓ లు, ఎన్నికల సిబ్బంది ,గ్రామస్తులు పాల్గొన్నారు.

Avatar
STUDIO10TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!