-ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి
స్టూడియో 10 టీవీ న్యూస్, నవంబర్ 15, మహానంది: ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం సందర్భంగా దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు బందోబస్తు పెంచాలని ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం కోరారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి కార్యాలయంలో ఆయన కలిసి మహానంది క్షేత్రంలో భద్రత చర్యలు చేపట్టాలని విన్నవించారు. అనంతరం ఎస్పీని శాలువాతో సన్మానించి, స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మహానంది ఎస్ఐ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.